WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్వరలో కొత్త 10 రూపాయల నోటు

త్వ‌ర‌లో మ‌రిన్ని సెక్యూరిటీ ఫీచ‌ర్స్‌తో కొత్త ప‌ది నోట్లు విడుద‌ల చేయాల‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణ‌యించింది. మ‌హాత్మాగాంధీ సిరీస్‌-2005 నోట్ల‌పై ఉన్న రెండు నంబ‌ర్ ప్యానెల్స్‌పై ఇన్‌సెట్ లెట‌ర్ ఎల్ ఉంటుంద‌ని, ఉర్జిత్ ప‌టేల్ సంత‌కంతో వ‌స్తాయ‌ని ఆర్బీఐ గురువారం వెల్ల‌డించింది. నోటుకు ఒక‌వైపు ముద్ర‌ణ ఏడాది 2017గా ఉంటుంది. ఇక రెండు ప్యానెల్స్‌లోనూ ఎడ‌మ అంకె చిన్న‌గా.. కుడి అంకె పెద్ద‌గా ఉంటుంది. మొద‌టి మూడు ఆల్ఫాన్యూమ‌రిక్ క్యారెక్ట‌ర్లు మాత్రం ఒకే సైజులో ఉంటాయి. ఈ కొత్త నోట్లతోపాటు పాత నోట్లు కూడా చెలామ‌ణిలో ఉంటాయ‌ని ఆర్బీఐ నోటిఫికేష‌న్ స్ప‌ష్టంచేసింది.

(203)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ