WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తగ్గిన బంగారం ధర

న్యూఢిల్లీ: బంగారం ధర మళ్లీ తగ్గింది. నిన్న రూ.30వేల దిగువకు చేరుకున్న పది గ్రాముల పసిడి ధర నేడు మరింత తగ్గి రూ.29 వేల దిగువకు చేరుకుంది. దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానికి డిమాండ్ తగ్గడంతో ఒక్కసారిగా భారీ పతనాన్ని నమోదు చేసింది. శుక్రవారం పది గ్రాములకు ఏకంగా రూ.400 తగ్గి రూ.28,850కి చేరుకుంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించి కిలోకు రూ.525 తగ్గి రూ.40,975కు చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం వల్లే వెండి ధర తగ్గినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి.

(229)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ