WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చినబాబు' బాటలో 'బాపట్లబాబు'...!

కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకునేందుకు..ప్రత్యర్థుల వేధింపులకు బలైన వారికి ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు, కార్యకర్తల సంక్షేమనిధి స్థాపనకు ముఖ్య కారుకుడైన నారా లోకేష్‌ బాటలో 'బాపట్ల' నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ అనుసరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి ఆర్థిక సహాయం సంక్షేమనిధి ద్వారా చినబాబు అందించగా ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బాపట్ల నియోజకవర్గ కార్యకర్తల సంక్షేమనిధి ఏర్పాటు చేశారు 'అన్నం'. తనకు  ఎమ్మెల్సీ ద్వారా వచ్చే జీతభత్యాలన్నిటిని సంక్షేమనిధికి విరాళాలు ఇవ్వడమే కాకుండా, పలువురు నాయకులను, వ్యాపారాలను భాగస్వాములుగా చేసుకుని సంక్షేమనిధికి నిధులు వసూలుచేశారు. ఈ విధంగా వసూలు చేసిన నిధులు శనివారం బాపట్ల పట్టణంలో  ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, కృష్ణా జిల్లా అనురాధ చేతుల మీదుగా కార్యకర్తలకు అందజేశారు. 

   'చినబాబు' రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను ఆదుకుంటుండగా మా బాపట్ల సతీష్‌బాబు నియోజకవర్గ కార్యకర్తలకు ఆర్థికంగా చేయోతనిస్తున్నారని కార్యకర్తలు కొనియాడారు. సుమారు 40మంది కార్యకర్తలకు ఐదు లక్షల విలువగల చెక్‌లను జడ్పీ ఛైర్మన్‌ గద్దె అనురాధ పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో 'అన్నం' విశాల హృదయాన్ని కొనియాడారు. తరువాత 'అన్నం' మాట్లాడుతూ తాను 'చినబాబు'ను చూసి సంక్షేమ నిధిని ఏర్పాటు చేశానని ఎంతో మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సంక్షేమనిధికి విరాళాలు ఇచ్చారని చెప్పారు. ఈ సంక్షేమ నిధి లక్షల్లోనే ఉందని ముందు ముందు అది మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలు పార్టీ కోసం రాత్రింబవళ్లు కృషి చేసిన కార్యకర్తలకు తాను ఉపయోగపడతానని అన్నారు. తాజాగా ఈ సంక్షేమ నిధి ద్వారా మరో రెండేళ్లలో వేలాది మంది కార్యకర్తలకు చేయూతనిస్తామని ఆయన చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని, మిగతా వారు కూడా సంక్షేమనిధికి విరాళాలు ఇస్తే కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే  విధంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు, పార్టీ నాయకులు హాజరై 'సతీష్‌' ముందుచూపుతో ఏర్పాటు చేసిన సంక్షేమనిధికి తాము కూడా విరాళాలు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రతినిధులు వందలాది మంది హాజరయ్యారు.
(350)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ