WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బంగారం తాకట్టుపైనా ఆంక్షలు...!

ముంబయి: భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లు బంగారంపై ఇచ్చే రుణం నగదు రూపంలో రూ.25వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా బంగారంపై రూ.లక్ష వరకూ నగదు రూపంలోనూ ఆపై మొత్తాన్ని చెక్కురూపంలో చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయంతో చెల్లింపును రూ.25వేల పరిమితం చేస్తూ ఈ మేరకు ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

   ప్రజలను డిజిటల్‌ చెల్లింపుల దిశగా ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేరుగా నగదు లావాదేవీలను తగ్గించడానికి వీలైనని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ‘ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం నగదు పరిమితిని రూ.25వేలకు తగ్గించాం’ అని ఆర్‌బీఐ పేర్కొంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు నగదు కొరతతో సతమతమయ్యారు. తాజాగా బ్యాంకు ఖాతా నిర్వహణ సంబంధించిన లావాదేవీలపై రుసుములు విధించనున్నట్లు చేసిన ప్రకటన సామాన్యులకు శరాఘాతమే. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని కుదవపెట్టుకుని డబ్బు తెచ్చుకునే వారి పరిస్థితి అగమ్యగోచరమైనట్లే!...

(211)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ