లేటెస్ట్

జీతాలు పెంపు కోసం...ఉద్యమిస్తామంటున్న 'సాక్షి' ఉద్యోగులు...!

తమ బాస్‌ ముఖ్యమంత్రి అయ్యారన్న సంతోషంతో ఎన్నాళ్లుగానో...గొడ్డు చాకిరి చేస్తోన్న 'సాక్షి' ఉద్యోగులు..తమ జీతాలు పెరుగుతాయని ఆశ పెట్టుకుంటే...వారి ఆశలు ఆడియాసలు అయ్యాయని...వాపోతున్నారు. 'సాక్షి'లో పనిచేసే ఉద్యోగులకు ఎప్పటి నుంచో...జీతాలు పెంచడం లేదట...ప్రతిపక్షంలో ఉన్నాం..కదా..'జగన్‌'..ఇబ్బందుల్లో ఉన్నారని ఓర్చుకున్న వాళ్లు..ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వారి జీతాల సంగతి తేల్చలేదట. ఒకవైపు రాష్ట్రంలో ప్రతి వర్గంపై వరాల జల్లులు కురిపిస్తున్న 'జగన్‌'..మరో వైపు..తమపై శీత కన్ను వేశారని...వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లనుంచి జీతాలు పెంచడం లేదని, కేవలం 15వేలకే పనిచేస్తున్నామని...ఇప్పుడు 6శాతం పెంచుతామని 'సాక్షి' యాజమాన్యం చెప్పడంపై దానిలో పనిచేసే ఉద్యోగులు..ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ ఇస్తోన్న 'జగన్‌' 'సాక్షి' ఉద్యోగులకు మాత్రం నామ మాత్రం పెంచుతున్నారని, ఇది సరికాదని, తమ ఆవేదన అర్థం చేసుకుని..ఇప్పటికైనా...అర్థవంతమైన రీతిలో జీతాలు పెంచాలని కోరుతున్నారు. ఒక వేళ జీతాలు పెంచకపోతే మూకుమ్మడిగా ఉద్యోగాలను వదిలేస్తామని, ఇక అటో..ఇటో తేల్చేస్తామని చాలా మంది ఉద్యోగులు..అంటున్నారు. మొత్తం మీద..తమ 'బాస్‌' సిఎం అయిన తరువాత కూడా తమకు న్యాయం జరగలేదని..వారు వాపోతున్నారు. వారి వారి మొర 'జగన్‌' పరిష్కరిస్తారా..? లేదో వేచి చూడాల్సి ఉంది. 

(599)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ