WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

19ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జనాభా లెక్కలు...!

ఇస్లామాబాద్‌ మార్చ్ 13:: 19 సంవత్సరాల తర్వాత జనాభా లెక్కలకు పాకిస్థాన్‌ శ్రీకారం చుట్టింది. పాకిస్థాన్‌లో చివరిసారిగా 1998లో జనాభా లెక్కలను చేపట్టారు. దాని ప్రకారం ఆ దేశ జనాభా 180 మిలియన్లు.  బుధవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం 2లక్షల మంది సిబ్బందిని నియమించింది. ఈ సందర్భంగా ఆ దేశ సైనికదళ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌, సమాచారశాఖ మంత్రి మరియం ఔరంగజేబ్‌లు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. జనాభా లెక్కలకు సంబంధించిన కార్యాచరణను వివరించారు. రెండు దశల్లో దీనిని నిర్వహిస్తామని, మే 25నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. 

   ‘జనాభా లెక్కల కార్యక్రమాన్ని 2లక్షలమంది సిబ్బందితో నిర్వహిస్తున్నాం’ అని గఫూర్‌ తెలిపారు. జనాభా లెక్కల పరిగణకుడితో కనీసం ఒక సైనికుడు కూడా వెళ్తాడని అన్నారు. కేవలం వారికి భద్రత కల్పించేందుకు మాత్రమే సైనికులను తోడుగా పంపిస్తున్నామని, అదే విధంగా పరిగణకులు సేకరించే డేటాను వారు పునః పరిశీలిస్తారని అన్నారు.జనాభా లెక్కల కార్య‌క్ర‌మంలో 1,18,918మంది పౌర సిబ్బంది పాల్గొంటారని, వారికి తగిన శిక్షణ ఇచ్చామని మంత్రి మరియం తెలిపారు. మొదటిదశ మార్చి 15న ప్రారంభమై, ఏప్రిల్‌ 15న ముగుస్తుందని, రెండో దశ ఏప్రిల్‌ 25న మొదలై మే 25న ముగుస్తుందని వెల్లడించారు

(338)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ