WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కస్తూరి'పై కన్నేసిందెవరు..?

సినిమా పరిశ్రమలో హీరోయిన్లపై లైంగిక దాష్టికాలు జరగడంపై ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు, మాజీ హీరోయిన్లు స్పందించారు. కేరళ హీరోయిన్‌ భావన తనపై జరిగిన అత్యాచారంపై ఫిర్యాదు చేయడంతో చాలా మంది హీరోయిన్లు తమను ఎవరెవరు ఎలా వేధించారో ఇప్పుడు బహిర్గతం చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఇటువంటి లైంగిక సంబంధాలు మామూలే అయినప్పటికీ ఇప్పుడు హీరోయిన్లు చేస్తోన్న ఫిర్యాదులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో 'రాధికా ఆప్టే, అర్చన, మాధవీలత, శృతి హరిహరన్‌ వంటి హీరోయిన్లు తెలుగు సినిమా హీరోలు తమను లైంగికంగా వేధించారని పేర్కొన్నారు. ఇప్పుడు అదే దారిలో మాజీ హీరోయిన్‌ 'కస్తూరి' మరో బాంబు పేల్చింది. తనను లైంగికంగా ఓ హీరో వేధించారని, ఆయనకు తాను లొంగకపోవడంతో ఆయనతో చేసే సినిమాలో వేధించారని చెప్పుకుంది. 

  పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన ఈమె తాజాగా చెన్నై వచ్చినప్పుడు ఈ విషయాలను మీడియాతో చెప్పింది. అతను ప్రస్తుతం ఓ రాజకీయపార్టీలో కీలకంగా ఉన్నారని, తనతో సినిమా చేసేటప్పుడు రూం రావాలని ఒకటే బెదిరించారని, అయితే తాను రాకపోవడంతో తనపై రుసరుసలాడి తరువాత సినిమాల్లో తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఆ వ్యక్తి చాలా పవర్‌పుల్‌ అని, ఆయనకు'నో' అంటే చాలా ఆగ్రహం వస్తుందని చెప్పింది. మొత్తం మీద 'కస్తూరి' చెప్పిన హీరో ఎవరనే విషయంపై తెలుగుసినీ పరిశ్రమ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కొంత మంది ఆ వ్యక్తి పేరు తమకు తెలుసనని, అయితే బహిరంగంగా ఆయన పేరు చెపితే తమకు ఇక సినీ ఇండస్ట్రీలో పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానిస్తున్నారు.

(517)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ