WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' ఎందుకు రాలేదో...!

టిడిపి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాత్తుగా మరణించడం రాజకీయవర్గాలను నివ్వెర పరిచింది. ఆయన మృతిపై అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించాయి. టిడిపి నేతలు తాము ఒక బలమైన రాజకీయశక్తిని కోల్పోయామని బాధపడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లను 'భూమా' మరణం తీవ్రంగా బాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలో ఉన్న 'భూమా' మరణ సమయంలో కూడా అదే పార్టీలో ఉన్నారు. పార్టీలో సుధీర్ఘకాలం ఉన్నా కొన్నాళ్లు పిఆర్పీ,వైకాపాలో భూమా కుటుంబం ఉన్నా 'చంద్రబాబు'తో సన్నిహిత సంబంధాలనే నెరపేవారు. అటువంటి నాయకుడు మరణించడం తనకు వ్యక్తిగతంగా చాలా నష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక కర్నూలు, కడప, అనంతపురం,చిత్తూరు జిల్లాలకు చెందిన అన్నిపార్టీలనాయకులు కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. అయితే ప్రతిపక్ష వైకాపా అధినేత 'జగన్‌' 'భూమా' అంత్యక్రియలకు రాకపోవడంపై ఆ పార్టీలోనూ, ఇతర రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

  రాజకీయంగా తనతో విభేధించి టిడిపిలో చేరినా, 'జగన్‌'కు దగ్గర బంధువు 'భూమా నాగిరెడ్డి'. భూమా నాగిరెడ్డి కుమార్తె ఎమ్మెల్యే అఖిల ప్రియను 'జగన్‌' మేనమామ 'రవీంద్రరెడ్డి' కొడుకు వివాహం చేసుకున్న తరువాత వారు దగ్గర బంధువులు అయ్యారు. అయితే వారు విడాకులు తీసుకున్నా 'జగన్‌', భూమా నాగిరెడ్డిల కుటుంబాల మధ్య బంధుత్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తమ బంధువు మరణిస్తే కనీసం చూడడానికి కూడా 'జగన్‌' రాకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన మరణించినప్పుడు 'భూమా నాగిరెడ్డి' తమ కుటుంబసభ్యుడని ఆయన మరణం తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని 'జగన్‌' సంతాపం తెలిపారు. ఆయన సంతాపం చూసిన వారు అంత్యక్రియలకు 'జగన్‌' హాజరవుతారని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా 'జగన్‌' కుటుంబసభ్యులెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన చిననాన్న వై.ఎస్‌.వివేకానందరెడ్డి మాత్రం అక్కడకు వచ్చారు. 'జగన్‌' తల్లి విజయమ్మ కానీ, ఆయన సోదరి 'షర్మిల' కానీ హాజరు కాలేదు. కాగా 'జగన్‌' హాజరు కాకపోవడంపై పలువిధాలుగా 'భూమా' సన్నిహితులు చర్చించుకున్నారు.

(681)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ