లేటెస్ట్

వై.ఎస్‌కు 'చేవెళ్ల' చెల్లమ్మ...'జగన్‌'కు...'పత్తిపాడు' చెల్లమ్మ...!

రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. సుధీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవి కోసం...'వై.ఎస్‌' పోరాడితే...'జగన్‌' కూడా అలానే పోరాడి ముఖ్యమంత్రి పదవి సంపాదించుకున్నారు. వై.ఎస్‌ పాదయాత్ర చేస్తే...'జగన్‌' కూడా పాదయాత్ర చేశారు...ఇద్దరూ..అనుకున్న విధంగానే ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత...తమ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి వర్గాన్ని విస్తరించుకున్నారు. 2009లో వై.ఎస్‌. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత...రాష్ట్ర హోం మంత్రిగా 'సబితా ఇంద్రారెడ్డి'ని ఎంపిక చేశారు. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం. హోం మంత్రిగా ఎప్పుడూ..పురుషులనే ఎంపిక చేసే పార్టీలు తొలిసారిగా ఒక మహిళా నేతను ఆ పదవికి ఎంపిక చేయడం...ఆశ్చర్యం కల్గించింది. అప్పుడు..వై.ఎస్‌.ఎలా చేశారో..ఇప్పుడు 'జగన్‌' కూడా..అదే విధంగా ఒక మహిళా నేతను హోంమంత్రిగా ఎంపిక చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి గెలిచిన 'మేకతోటి సుచరిత'కు హోంమంత్రిని అప్పగించారు. 'పత్తిపాడు' నుంచి మూడు సార్లు గెలిచిన 'సుచరిత' మొదటి నుంచి వై.ఎస్‌.కుటుంబానికి విధేయురాలే. దీంతో..'జగన్‌' అధికారంలోకి వచ్చిన వెంటనే...ఆమెకు హోంమంత్రి పదవిని అప్పగించారు. అప్పట్లో...'సబితాఇంద్రారెడ్డి'కి 'వై.ఎస్‌' హోం మంత్రి పదవి ఇస్తే...ఇప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు హోంమంత్రి పదవిని ఇచ్చి..తండ్రిని మించిన తనయుడుగా తమ నేత పేరు తెచ్చుకున్నారని వైకాపా వర్గాలు 'జగన్‌'ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. 

(219)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ