WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాహుబలి-2' ట్రైలర్‌ విడుదల...!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' మొదటి భాగం భారతీయ ప్రేక్షకులతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అల‌రించింది. ఓ భారతీయ దర్శకుడు తీసిన సినిమాకు ఈ రీతిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి మొదటి భాగం రిలీజ్‌ అయిన తరువాత దాని కొనసాగింపు కోసం భారతీయ ప్రేక్షకులతోపాటు, అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 'బాహుబలి-2' ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.ప్రభాస్‌, రానాల మధ్య వచ్చే ఫైటింగ్‌ సీన్‌ను ఈ ట్రైలర్‌లో చూపించారు.'కట్టప్ప' 'బాహుబలి'ని ఎందుకు చంపాడు..అనే ప్రశ్న ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి మదలిలో మెదిలే ప్రశ్న. దానికి ఈ ట్రైలర్‌లో సమాధానం లభించలేదు కానీ...! 'నీవు నా పక్కన ఉంటే...నన్ను చంపే మగాడే లేడన్న' బాహుబలి డైలాగ్‌ దీనిలో ఉంది. అంటే 'కటప్ప'పై బాహుబలి ఎంత నమ్మకం పెట్టుకున్నాడో ఈ డైలాగ్‌తో అర్థం అవుతుంది. 'అనుష్క' పోరాటాలు...అదే సమయంలో రాజకోట, 'బాహుబలి' రాజుగా ప్రమాణస్వీకారం, నాజర్‌ గోడను బద్దలు కొట్టే సన్నివేశం ప్రేక్షకులను మమైరపించింది. మొత్తం మీద ట్రైలర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. యూ ట్యూబ్‌లో ఇప్పటికే ఈ ట్రైలర్‌ రికార్డులు సృష్టిస్తోంది. మరి కొద్ది రోజుల్లో అంతర్జాతీయ రికార్డు సృష్టించినా ఆశ్చర్యం లేదు.




(380)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ