WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మ‌రికొంత‌కాలం కొన‌సాగ‌నున్న క‌రెన్సీ క‌ష్టాలు...!

జనాల కరెన్సీ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. అన్ని బ్యాంకుల ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గత మూడు వారాలుగా ఏటీఎంలు మూత పడ్డాయి.  తెలుగు రాష్ట్రాల్లో ఈ కొరత మరీ దారుణంగా ఉంది. నగదు కోసం జనాలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. డిపాజిట్ల మొత్తాలు తగ్గడం ,విత్ డ్రాలపై పరిమితి ఎత్తివేయడంతో, బ్యాంకుల నుంచి వినియోగదారులు పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నారు. దీంతో, కరెన్సీ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అధికారులు స్పందిస్తూ, ఈ నెలఖరు వరకు కరెన్సీ కష్టాలు తప్పవని తెలిపారు. మరో వారం రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో నగదు నిల్వలు పెరుగుతాయని చెప్పారు.

(177)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ