WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వాకాటి' గెలుపు ఖాయం...!

నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌తీరుపై టిడిపి నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 150పైకి ఓట్ల తేడాతో తమ అభ్యర్థి 'వాకాటి నారాయణరెడ్డి' విజయం సాధిస్తారని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి తెలిపారు. అధికారపార్టీ నుండి కొన్ని ఓట్లు ప్రతిపక్షపార్టీకి క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న దాన్ని 'ఆదాల' కొట్టిపారేశారు. ప్రతిపక్షాల నుండే తమకు కొన్ని ఓట్లు వచ్చి ఉండవచ్చని అన్నారు. విపక్షాల ప్రలోభాలకు తమ ఓటర్లు లొంగలేదని, ఆశలు చూపినా ఓటర్లు తిప్పికొట్టారన్నారు. ఒకరూ...ఇద్దరు తప్ప తమ పార్టీ ఓటలన్నీ 'నారాయణరెడ్డి'కి పోలైయ్యాయని 'ఆదాల' చెప్పారు. నెల్లూరులో జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి అధికారపార్టీ అభ్యర్థి విజయం ఖాయమని ఇంటిలిజెన్స్‌ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి. కొంత మంది విపక్షాల నాయకులతో మీడియా వర్గాలు ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడగా అధికారపార్టీ ఓటర్లకే లక్షల రూపాయలు ముట్టచెప్పారని, తమ అభ్యర్థులకు ఎటువంటి చెల్లింపులు తాము చేయనప్పటికీ అనేక మందిఓటర్లు తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేశారని చెబుతున్నారు. నెల్లూరు పోలింగ్‌ను ఎప్పటికప్పుడు సిఎంఒ వర్గాలు కూడా ఆరా తీశాయి. నెల్లూరు జిల్లా టిడిపి నాయకుల్లో పరస్పర విభేదాలు ఉన్నప్పటికీ అందరినీ ఒకతాటిపై నడిపించడంలో 'చంద్రబాబు, చినబాబులు సఫలీకృతులయ్యారు.


(302)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ