WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నాకు అవకాశాలు ఇవ్వడం లేదు...!

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగువారికి అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించింది సీనియర్‌ నటి హేమ. తాను సినిమా పరిశ్రమలో ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నానని తనకు తల్లి పాత్రలు ఇవ్వడానికి దర్శకులు, నిర్మాతలు నిరాకరిస్తున్నారని, తన కన్నా ఇతర భాషల వాళ్లు బాగా చేస్తారా? ఎందుకు తనపై వివక్ష చూపుతున్నారని ఆమె ప్రశ్నించింది. దర్శకుడు పూరీ జగన్నాధ్‌ తన సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా ఇతర భాషా నటులను తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎన్టీఆర్‌ తల్లిపాత్రకు పనికిరానా? అంటూ ప్రశ్నించారు. భాషా నటులను దర్శకులు ప్రోత్సహించకపోతే ఎలా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

   ఇటీవల కాలంలో తమపై లైంగిక వేధింపులకు హీరోలు, నిర్మాతలు పాల్పడ్డారని కొంతమంది హీరోయిన్లు ఫిర్యాదు చేయడంపై ఆమె మండిపడ్డారు. సినిమాల్లో అవకాశాలు రాకే వారు ఈ విధమైన ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తాము చేసిన సినిమాలు తప్ప వారికి ప్రస్తుతానికి చెప్పుకోవడానికి ఏమీ లేదని, అందుకే ఈ రకమైన విమర్శలు చేసి పాపులర్‌ కావాలని భావిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సినిమా పరిశ్రమ అంత చెడ్డదైతే నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమ సంతానాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని 'హేమ' ప్రశ్నించారు. సోషల్‌ మీడియా వల్ల చాలా ప్రమాదాలు వస్తున్నాయని, ఏదిపడితే అది రాసి పరువు తీస్తున్నారని ఆమె వాపోయారు.


(979)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ