WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌'పై పొగడ్తల వర్షం కురిపించిన టివి9 రవిప్రకాష్‌..!

'కాటమరాయుడు' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో టివి9 రవిప్రకాష్‌ 'పవన్‌కళ్యాణ్‌' పొగడ్తల వర్షం కురిపించారు. శనివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఎన్‌టివి ఛైర్మన్‌ చౌదరితో కలసి పాల్గొన్న 'రవిప్రకాష్‌' 'పవన్‌' దండకం చదివారు. రాజకీయాల్లో 'పవన్‌' వంటివాళ్లు అరుదని, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే ధైర్యాన్ని ఆయన నూరిపోశారని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 'పవన్‌కళ్యాణ్‌' ఏమి చేశాడో అందరికీ తెలుసనని, అటువంటి నాయకుడు తాను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడని, లేకుంటే డబ్బు సంపాదించుకునేవారని వ్యాఖ్యానించారు. కానీ 'పవన్‌' వాటిని వద్దనుకుని ప్రజల్లో ప్రశ్నించడం నేర్పించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్న ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం, ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కినా కొందరు 'మోడీ' భయపడి నోరు మెదపడం లేదని, 'పవన్‌' మాత్రం అన్యాయంపై ప్రశ్నిస్తున్నారని ఆయనను ఆకాశానికెత్తేశారు. యువకుల్లో స్పూర్తినింపుతున్న 'పవన్‌' నాయకత్వం యువకులకు ఆదర్శమని ఆయన కొనియాడారు. మొత్తం మీద సినిమా ఫంక్షన్‌లో 'రవిప్రకాష్‌' చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.


(200)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ