WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలుగు సినిమాలు ఉంటాయనే సంగతే తెలియదు...!

తన అందాలతో కుర్రకారు మనస్సులను కొల్లగొట్టిన 'రకుల్‌ప్రీత్‌సింగ్‌'కు అసలు తెలుగు సినిమాలు ఉన్నాయనే సంగతే తెలియదట. సంవత్సరానికి దాదాపు వంద సినిమాలకు పైగా తీసే తెలుగుసినీ పరిశ్రమ గురించి ఆమెకు మొన్నటి దాకా తెలియనే తెలియదట. మలయాళీ సినిమాలు ఉంటాయని అందుకే అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాని చెబుతోందీ సుందరి. మళయాలీ సినిమాల్లో చేసేటప్పుడు దర్శకుడు 'పూరీ జగన్నాధ్‌' తనకు తెలుగు సినిమాల గురించి చెప్పారట. ఆయన సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇస్తానని చెప్పినా చదువు పాడవుతుందని వద్దనుకుందట. 'కెరటం' అనే సినిమాలో ఐదు నిమిషాలు ఉంటే ఓ చిన్న సీన్‌ చేసిందట. తరువాత 'మిస్టర్‌ఫర్‌ఫెక్ట్‌' సినిమాలో 'ప్రభాస్‌' సరసన హీరోయిన్‌గా ఎంపిక అయిందట. ఐదు రోజులు సినిమా షూటింగ్‌ జరిగిన తరువాత ఆమెను నిర్మాత, దర్శకులు సినిమా నుంచి తొలగించారట. ఇలా ఎందుకు జరిగిందో ఆమెకు ఇప్పటి వరకూ తెలియని విషయమట. తరువాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' విజయం తరువాత తన వెంట పడ్డారని, ఇప్పుడిప్పుడే టాప్‌ హీరోయిన్‌గా ఎదుగుతున్నానని చెప్పుకుంటోందీ  అమ్మడు. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమ గురించే తెలియని ఈమె ఇప్పుడు ఇక్కడ టాప్‌ హీరోయిన్‌. అదృష్టం అంటే 'రకుల్‌'దే.


(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ