WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అమెరికాలో ఇద్ద‌రు తెలుగు వారి దారుణ హ‌త్య‌...!

అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన జాతివివక్ష నేపథ్యంలో.. శ్రీనివాస్ కూఛిబొట్ల హత్యకు గురి కావటం తెలిసిందే. ఈ విషాదం నుంచి బయటకు రాక ముందే.. ఇద్దరు తెలుగువారు హత్యకు గురి కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.అమెరికాలో తాజాగా హత్యకు గురైన ఇద్దరు ఏపీలోని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంకు చెందిన వారు. న్యూజెర్సీలోని మ్యాపుల్ సెట్ లో వారు నివసిస్తున్నారు. హతురాలి భర్త హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి రాగా.. భార్య.. కొడుకు రక్తపు మడుగులో ఉండటంతో షాక్ తిన్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకుఅందజేశారు. హనుమంతరావుకు.. 40 ఏళ్ల శశికళకు 14ఏళ్ల క్రితం వివాహమైంది. తొమ్మిదేళ్లుగా వారు అమెరికాలో నివసిస్తున్నారు. ఒక కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్ గా హనుమంతరావు పని చేస్తుంటే.. శశికళ వర్క్ ఫ్రంహోం చేస్తున్నారు. సాయంత్రం బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు.సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న హనుమంతరావు.. ఇంట్లో భార్య.. కొడుకు విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు. వారి గొంతుల్ని పాశవికంగా కోసి చంపిన వైనాన్నిగుర్తించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసును నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై హనుమంతరావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

(300)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ