WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లిబియా తీరంలో మునిగిన బోట్లు:200మంది మృతి...!

మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో మ‌రో దారుణం జ‌రిగింది. లిబియా తీరం స‌మీపంలో రెండు బోట్లు ముగినిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 200 మందికిపైగా మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు. స్పెయిన్‌కు చెందిన ప్రోయాక్టివ్ ఓపెన్ ఆర్మ్స్ అనే ఎన్జీవో సంస్థ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. బోల్తా కొట్టిన రెండు బోట్ల నుంచి సుమారు అయిదు మృత‌దేహాల‌ను వెలికితీసిన‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఒక్కొక్క బోటు నుంచి సుమారు వంద మందికిపైగా చ‌నిపోయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఇట‌లీ కోస్టు గార్డులు కూడా మృతుల అంశాన్ని దృవీక‌రించారు. స్మ‌గ్ల‌ర్లు తీసుకెళ్తున్న బోట్ల నుంచి సుమారు 240 మంది చ‌నిపోయి ఉంటార‌ని ప్రోయాక్టివ్ గ్రూప్‌కు చెందిన లారా లాంజ్వా పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల నుంచి మ‌ధ్య‌ద‌రా స‌ముద్రం మీదుగా ఇట‌లీ చేరుకుని అక్క‌డ నుంచి యూరోప్ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్న శ‌ర‌ణార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న‌ది. ట‌ర్కీ నుంచి గ్రీస్ మ‌ధ్య ఉన్న రూట్‌ను పూర్తిగా మూసివేయ‌డంతో అక్ర‌మ వ‌ల‌స‌దారులు ట్రైపోలి నుంచి యూరోప్ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త అయిదు రోజుల్లో 40 రెస్క్యూ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్లు ఇట‌లీ కోస్టు గార్డులు తెలిపారు. ఈ ఏడాది ఇప్ప‌టికే సుమారు 20 వేల వ‌ల‌స‌దారులు ఇట‌లీ చేరుకున్న‌ట్లు అంత‌ర్జాతీయ శ‌ర‌ణార్థుల సంస్థ వెల్ల‌డించింది.

(417)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ