WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డాక్టర్‌ కోడెల సత్యనారాయణ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యరక్ష...!

బడుగు,బలహీనవర్గాలకు ఎన్టీఆర్‌ వైద్య,ఆరోగ్యపథకం ద్వారా ఉచితంగా వైద్యసహాయం అందుతోంది. కార్మికులకు 'చంద్రన్నభీమా పథకం' ద్వారా వారికి కావాల్సిన వైద్య సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యరక్ష అనే పథకాన్ని 'చంద్రబాబు' ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం గ్రామ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రచారాన్ని పొందుతుంది. 'ఆరోగ్యరక్ష' పథకంలో లబ్దిపొందాలంటే రూ.1200/- ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. దీని వలన సుమారు రెండు లక్షల వరకు వ్యక్తిగత ఆరోగ్యభీమా లభిస్తుంది. ఈ పథకం ఎంతో ముఖ్యమైందని, అయినా ప్రజలు దీనిపై ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రాతినిథ్యం వహిస్తున్న 'సత్తెనపల్లి' నియోజకవర్గంలో పథకం ఊపందుకుంది. ముప్పాళ్ల మండలంలో నూటికి నూరుశాతం మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యరక్ష పథకాన్ని వినియోగించు కుంటున్నారు. 

  వీరిలో కొందరు రూ.1200/- చెల్లించగా ఎక్కువ మంది 'కోడెల సత్యనారాయణ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా ఈ ప్రీమియాన్ని చెల్లిస్తున్నారు. ఆరోగ్యరక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకునే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో స్పీకర్‌ కోడెల తనయుడు డాక్టర్‌ కోడెల శివరామ్‌ తమ ట్రస్టు ద్వారా ఆ సొమ్మును చాలా మందికి చెల్లిస్తున్నారు. దీంతో మండలంలో 90శాతంపైగా ప్రజలకు 'ఆరోగ్యరక్ష' పథకం అందుతుంది. త్వరలో 'సత్తెనపల్లి' పట్టణం, సత్తెనపల్లి గ్రామీణ మండలం, నకిరికల్లు మండలానికి ఆరోగ్యరక్ష పథకాన్ని పూర్తి స్థాయిలో విస్తరించేందుకు 'శివరామ్‌' ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికప్పుడు వ్యాధులు వస్తే హాస్పటల్స్‌కు లక్షలు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యరక్ష పథకానికి రూ.1200/- ప్రీమియం చెల్లించడానికి వెనుకడుగు వేయడంపై పలువురు టిడిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ఉచితంగా పొందేందుకు అపడిన ప్రజలు సొమ్ము చెల్లించడానికి మొరాయిస్తున్నారు. వేలాది రూపాయలను అనవసర పనులకు దుబారా చేస్తున్నారు..ఆరోగ్యరక్ష పథకంలో చేరితే ఎన్ని లాభాలు ఉన్నాయో విడమరచి చెప్పినా వారికి అర్థం కావడం లేదు. 

  దీంతో 'కోడెల సత్యనారాయణ ట్రస్ట్‌'ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలో పూర్తిగా ఆ సొమ్మును చెల్లించాలని డాక్టర్‌ శివరామ్‌ భావిస్తున్నారు. రాష్ట్రంలోని మెజార్టీ నియోజకవర్గాల్లో ఆరోగ్యరక్ష పథకం ఊసేలేదు. కుటుంబ సభ్యులల్లో ఒక్కొక్కరు రూ.1200/- చెల్లించేందుకు మొగ్గు చూపడం లేదు. అదే ప్రీమియం మొత్తం కుటుంబానికి వర్తింపచేస్తే 'ఆరోగ్యరక్ష' పథకం విజయవంతం అయి ఉండేది. కానీ ప్రీమియం ఎక్కువగా ఉందన్న కారణంతో మెజార్టీ ప్రజలు దీనిపై ఆసక్తి చూపడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. తన నియోజకవర్గంలో ఆరోగ్యరక్ష పథకాన్ని మరో మూడు మాసాల్లో అందరికీ వర్తింప చేయాలని ప్రీమియం చెల్లించనవారికి తమ ట్రస్టు ద్వారా చెల్లించి నూరుశాతం ప్రజలకు ఆరోగ్యరక్ష పథకాన్ని అందించాలని డాక్టర్‌ శివరామ్‌ కృషి చేస్తున్నారు.  

(543)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ