WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపా బరిగీసి నిలిస్తే...ఫలితం వేరయ్యేదేమో....!

నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవలీలగా అధికారపార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసిన అధికారపార్టీ నేతలకు ఓటర్లు చుక్కలు చూపించారు. 150 నుండి 200 మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని మంత్రి నారాయణ కూడా బీరాలు పలికారు. టిడిపి ఓటర్లల్లో అనేక మంది క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడడంతో మెజార్టీ తగ్గిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ 'జగన్‌' పార్టీ ఓటర్లు కూడా తమ పార్టీ అభ్యర్థిని కాదని టిడిపి అభ్యర్థికి ఓటు వేసినట్లు ఎన్నికల సరళిని బట్టి స్పష్టమైంది. రెండు పార్టీల ఓటర్లు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడడంతో గెలిచినవారికి, ఓడిన వారికి నిరాశ కల్గించింది. కేవలం 87ఓట్లతో అధికారపార్టీ అభ్యర్థి 'వాకాటి' విజయం సాధించారు. అయితే ఈ ఓట్లలో సగం ఓట్లు క్రాస్‌ అయ్యింటో పరిస్థితి ఏమయ్యేదని పార్టీ నాయకులు అంటున్నారు. అధికార పార్టీలో ఉన్న అసంతృప్తిని వైకాపా క్యాష్‌ చేసుకోలేకపోయింది. వారు కనుక ఈ అసంతృప్తిని క్యాష్‌ చేసుకున్నట్లయితే పరిస్థితి మరో రకంగా ఉండేదని వారు అంటున్నారు. 

    అధికారంలో ఉండి కూడా చావు తప్పి కన్నులు లొట్టపోయినట్లు టిడిపి అభ్యర్థి గెలవడంపై ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. తమకు వైకాపా అసలు పోటీయే కాదని బీరాలు పలికిన టిడిపి నాయకులు ఎన్నికల ఫలితాలు షాక్‌కు గురిచేశాయి. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మరి కొంత మంది నాయకులు గట్టిగా పనిచేయడంతో వారి మద్దతు దారులైన ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడకపోవడంతో స్వల్ప ఓట్ల మెజార్టీతో 'నారాయణరెడ్డి' బయటపడ్డారని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. 'జగన్‌' పార్టీ అభ్యర్థికి అధికారపార్టీ నాయకులు కొందరు సహకరించారని వార్తలు వచ్చాయి. దీనిపై నిజా, నిజాలు తెలుసుకుని తెలుసుకుని వెన్నుపోటుకు పాల్పడిన నాయకుల వివరాలను అధిష్టానానికి అందజేశామని పార్టీ నాయకులు చెబుతున్నారు. 

   'జగన్‌' పార్టీ నాయకులు తమ అభ్యర్థి ఓడిపోతారనే అనుమానంతో మౌనం దాల్చారు. వారు కనుక పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అధికారపార్టీ నాయకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత తాము కనుక గట్టిగా పోరాడి ఉండే బాగుండేదని...గెలవమని భావించడంతో అధికారపార్టీ గెలిచిందని వారు ఇప్పుడు వాపోతున్నారు. అధికారపార్టీ నాయకులు స్వంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తారని తాము అంచనా వేసి ఉంటే తాము గెలిచేవారమని వారు అంటున్నారు. ఏది ఏమైనా మంత్రి నారాయణ నాయకత్వాన్ని టిడిపిలోని మెజార్టీ నాయకులు అంగీకరించడం లేదని ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువు చేశాయి.

(367)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ