WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నాయక్‌' ముద్దు...'త్రిపాఠీ' వద్దు...!

గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగంలో కానిస్టేబుల్‌ స్థాయి నుండి డిఎస్పీ స్థాయి వరకు గ్రామీణ ఎస్పీ 'నారాయణనాయక్‌'కు మద్దతు ఇస్తుండగా...అదే స్థాయి నుండి సీనియర్ల స్థాయి వరకు అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎంత సిన్సియర్‌గా నిబంధనల ప్రకారం వ్యవహరించినా, ప్రోత్సహించకుండా మందలింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు త్రిపాఠీ. ఆ పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో లేదు. 'నారాయణనాయక్‌' పనితీరును అటురాజకీయ వర్గాలతో పాటు...ఇటు పోలీసు వర్గాలు కూడా అభినందనలతో ముంచెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాను రెండు భాగాలుగా విభజించడం పోలీసు వర్గాలకు మింగుడుపడడం లేదు. ఒక వేళ విభజించినా సరైన పథకం లేకుండా ప్రాంతాల్లో సమానత్వం పాటించలేదు. గుంటూరు నగరంలో ఇప్పటికీ ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. దీనిపై దృష్టిసారించాల్సిన అర్బన్‌ ఎస్పీ 'త్రిపాఠీ' వేరే విషయాలపై ఎక్కువ దృష్టిసారిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను అర్బన్‌ ప్రాంతంగా దూరంగా ఉన్న ప్రాంతాలను రూరల్‌ ప్రాంతాలుగా విభజించడంతో ఎవరెవరికీ ఏయే బాధ్యతలు నిర్వహించాలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు గందరగోళంగా ఉంది. నిజాయితీ సమర్థత కన్నా...లౌక్యంతో బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని సిబ్బంది అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయంలో త్రిపాఠీ పేరు ఎక్కువగా వినిపిస్తుండగా...'నారాయణ్‌నాయక్‌'పై వ్యతిరేకత అంతంత మాత్రంగానే వినిపిస్తుంది. రెండు విభాగాలను కలిపి 'నాయక్‌'ను ఎస్పీగా నియమిస్తే జిల్లా అంతా ఒకే తాటిపై ముందుకు పోతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

   ముఖ్యంగా గుంటూరు నగరంలో ఆటోలు, సిటీ బస్సులు, ద్విచక్రవాహనదారులు నిబంధనలకు విరుద్దంగా ఎక్కడబడితే అక్కడ పార్కింగ్‌ చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు కూర్చుని దూసుకెళ్లుతున్నారు. కారు నడుపుతున్న డ్రైవర్లు, ఆయా వాహనాల డ్రైవర్లు కూడా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నట్లు మీడియాలో ఇంతకు ముందే ప్రసారాలు వచ్చాయి. ఇదే విషయంపై 'జనం ప్రత్యేక ప్రతినిధి' గుంటూరు నగరంలో స్వయంగా కొన్ని ప్రాంతాలకు వెళ్లి వాస్తవాలను పరిశీలించారు. ఇదంతా నిజమేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో గుంటూరు ట్రాఫిక్‌కు సమర్థుడైన యువ ఐపిఎస్‌ అధికారిని నియమిస్తే పరిస్థితి గాడిలో పడుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ ఏ సమావేశం ఏ పార్టీ నాయకులు నిర్వహిస్తారో...ఏ పార్టీ నాయకులు రాస్తారోకోలు, ధర్నాలు ఎప్పుడు చేస్తారో ముందుగా తెలియజేయడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంత పోలీసులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలంటే కత్తిమీద సాము అవుతుంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు...మరో వైపు ఎమ్మెల్యేల తోపులాటలు, విమర్శలు వీటిని సరిచేయలేక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి గుంటూరు పట్టణ నగర ట్రాఫిక్‌ను సరిచేసేందుకు ఒక అధికారిని, శాంతిభద్రతల కొరకు అర్బన్‌ మరియు రూరల్‌కు కలిపి మరో అధికారిని నియమిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి.  

(535)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ