WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆర్టీసీ సంస్థ బలోపేతమే 'శ్రీహరి' లక్ష్యం...!

గుంటూరు జిల్లాలో అనేక బస్సు డిపోలు నష్టాల్లో ఉండడంతో, వాటిని లాభాల్లోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రాంతీయ మేనేజర్‌ 'జ్ఞానంగారి శ్రీహరి' నూతన పద్దతులను అవలంభించబోతున్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికులు తనకు రెండు కళ్లు అని సంస్థను లాభాల బాటలో నడిపించాలంటే కార్మికులందరూ కష్టపడి పనిచేస్తేనే సాధ్యపడుతుందనే ఉద్దేశ్యంతో వారితో సౌమ్యంగా మెలుగుతున్నారు. ఇప్పటికే కొన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ఒక వైపు లాభాలు మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండడం..తమ కర్తవ్యమని ఆయన కార్మికులను ఉద్దేశించి ఇటీవల చెప్పారు. కొన్ని డిపోలలో సిబ్బంది అదనంగా ఉన్న విషయం..ఆయన దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఎవరెవరి సేవలు ఎలా వినియోగించుకోవాలి..సంస్థపై ఆర్థిక భారం ఎక్కువ పడకుండా కార్మికులకు ఎటువంటి నష్టం కల్గకుండా ముందుకు ఎలా వెళ్లాలనే విషయంపై ఆయన నిత్యం సమీక్ష జరుపుతున్నారు. సంస్థ ఎండి కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు ఇటీవల బయటకు పొక్కింది. 

   గతంలో డిపో మేనేజర్‌గా తాటిపత్రి, కుప్పం, కర్నూలు-1 డిపోలలో పనిచేసిన అనుభవంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ ట్రాఫిక్‌ మేనేజర్‌గా, డివిజినల్‌ మేనేజర్‌గా, తణుకు, చిత్తూరు జోనల్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌గా, అదో విధంగా హైదరాబాద్‌ సిటీజోన్‌, హకింపేట,హైదరాబాద్‌, ప్రిన్స్‌పల్‌ ట్రాఫిక్‌ అకాడమీ, హైదరాబాద్‌, డిప్యూటీ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఆపరేషన్‌ బస్సుభవన్‌లో 'శ్రీహరి' పనిచేశారు. అంతే కాకుండా డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌(మార్కెటింగ్‌)లో పనిచేసిన ఆయన రీజినల్‌ మేనేజర్‌గా గుంటూరులో పనిచేస్తున్నారు. ఆర్‌ఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించాక, కార్మికులతో సన్నిహితంగా మెలుగుతున్నారు. గతంలో ఒక కండక్టర్‌ను కానీ, డ్రైవర్‌ను కానీ సస్పెండ్‌ చేస్తే ఆ సస్పెండ్‌ను రద్దు చేసేందుకు నెలలు సమయం తీసుకునేవారు..ప్రస్తుతం రీజినల్‌ 'జ్ఞానంగారి శ్రీహరి' వారి సమస్యలను పరిష్కరించి కార్మికుల అభినందనలను పొందుతున్నారు. ఇదే విషయంపై పలువురు కండక్టర్లను, డ్రైవర్లను 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా కలసి ప్రశ్నించగా అది వాస్తవమేనని చెప్పారు. సంస్థ ప్రగతికి, సిబ్బంది సంక్షేమానికి తపనపడుతున్న అధికారిగా 'శ్రీహరి' పేరు తెచ్చుకున్నారు. ప్రశంసలకు లొంగకుండా, విమర్శలకు భయపడకుండా నీతి,నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'శ్రీహరి'కి కార్మికులు అనేక సందర్బాల్లో అభినందనలు కూడా తెలిపారు. ఇప్పటికీ పలు గ్రామాల్లో ఆటోల హడావుడి ఎక్కువగా ఉండడంతో, ప్రయాణీకులను ఆర్టీసీ వైపు మళ్లించేందుకు నిత్యం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని, త్వరలో ఆర్టీసీ  గ్రామీణ ప్రాంతాల్లో బలం పుంజుకుంటుందని పలువురు కార్మికులు చెబుతున్నారు.

(280)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ