లేటెస్ట్

బాధ్యతలు స్వీకరించిన I&PR కమీషనర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార,పౌరసంబంధాల శాఖ కార్యదర్శిగా తుమ్మ విజయ కుమార్ రెడ్డి బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయ‌న‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వార‌ధిగా పనిచేస్తానని తనపై నమ్మకం ఉంచి, క‌మీష‌న‌ర్ గా నియ‌మించిన‌ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శాఖకు సంబంధించిన ఉద్యోగులంద‌రూ కష్టపడి పని చేస్తారని తెలిపారు. సమాచార,పౌర సంబంధాల శాఖ త‌న విధులను నిర్వహించడంలో మీడియా,జర్నలిస్టు కీలక పాత్ర పోషిస్తారని, జ‌ర్న‌లిస్టుల‌ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సంద‌ర్భంగా విజ‌య్ కుమార్ రెడ్డి తెలిపారు.

(361)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ