WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శ్రీ‌ముఖి మ‌రీ అంత పొట్టిదా....!?

హాట్‌ యాంకర్లు అనసూయ, రష్మిలతోపాటే బుల్లితెర మీద సూపర్‌ పాపులర్‌ అయిన యాంకర్‌ శ్రీముఖి. వీరిద్దరితో పోటీపడి అవకాశాలను దక్కించుకుంటోంది శ్రీముఖి. అనసూయ, రష్మీ వెండితెర మీద కూడా తమ గ్లామర్‌ను ప్రదర్శించారు. శ్రీముఖి కూడా వెండితెర మీద కనిపించినా ఇప్పటివరకు పద్ధతైన పాత్రల్లోనే కనిపించింది. అలాంటి శ్రీముఖికి ఇటీవల ఓ మెగాహీరో సినిమాలో ఐటెం సాంగ్‌ అవకాశం వచ్చిందట. వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్‌’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్‌ ఉందట. ఆ పాట కోసం శ్రీముఖిని తీసుకుందామనుకున్నాడట శ్రీనువైట్ల. అయితే ఆరడుగుల కంటే ఎక్కువ పొడవుండే వరుణ్‌ పక్కన శ్రీముఖి చాలా పొట్టిగా, చిన్నగా కనిపిస్తుందనే భావనతో శ్రీముఖిని తప్పించాడట. ఆమె స్థానంలో ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరా..’ పాటలో నర్తించిన భామను తీసుకున్నట్టు సమాచారం.

 

(322)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ