WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జియో ప్రీడేటా ఆఫ‌ర్లు...!

ఇన్నాళ్లూ హ‌్యాపీ న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్ అంటూ త‌మ యూజ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ ఫ్రీగా అందించిన రిల‌యెన్స్ జియో.. ఇప్పుడు కొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. మార్చి 31తో ఆల్ ఫ్రీ ఆఫ‌ర్ ముగుస్తుండ‌టంతో రీచార్జ్‌లను ప్రోత్స‌హించ‌డానికి ఈ కొత్త ఆఫ‌ర్లు తీసుకొచ్చింది. మార్చి 31లోపు రూ.149, ఆపై రీచార్జ్ చేసుకొనే వారికి ఉచితంగా 2 జీబీ, 5 జీబీ, 10 జీబీ డేటాను అందిస్తున్న‌ది. రూ.149 రీచార్జ్‌పై ప్ర‌స్తుతం నెల‌కు 2 జీబీ 4జీ డేటా వ‌స్తుండ‌గా.. దీనికి అద‌నంగా మ‌రో 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తారు. ఇక రూ.303 రీచార్జ్ చేసుకొనేవారికి నెల‌కు 28 జీబీ డేటా వ‌స్తుండ‌గా.. దీనికి అద‌నంగా మ‌రో 5 జీబీ ఉచితంగా ల‌భిస్తుంది. రూ.499 రీచార్జ్‌తో ప్ర‌స్తుత‌మున్న డేటాతోపాటు అద‌నంగా నెల‌కు 10 జీబీ డేటా ఉచితంగా ఇవ్వ‌నున్నారు. అంటే 499 రీచార్జ్ చేసుకునేవారికి ఏడాదికి 120 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. మార్చి 31లోపు రీచార్జ్ చేసుకుంటే.. ఈ యాడ్ ఆన్ ప్యాక్స్ ప్ర‌తి నెలా యాడ‌వుతూనే ఉంటాయి.  

(276)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ