WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వెంకయ్య' సిఫార్సుతో టిటిడి జెఇఒగా 'అశోక్‌కుమార్‌'...!

సచివాలయంలో జిఎడిశాఖ ప్రొటోకాల్‌ విభాగంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్‌కుమార్‌ను టిటిడి జెఇఒగా నియమించడానికి రంగం సిద్దమైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సమీపబంధువైన 'అశోక్‌కుమార్‌' ఆర్మీలో డిఫెన్స్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు డిప్యూటేషన్‌పై వచ్చారు. తనను తిరుమల జెఇఒగా నియమించాలని ఆయన సిఎం చంద్రబాబునాయుడును కోరినట్లు తెలిసింది. తిరుమల జెఇఒగా ఐఎఎస్‌ అధికారినే నియమించాలనే నిబంధనలు లేవు. సచివాలయంలో డిప్యూటీ కార్యదర్శి హోదా లేదా ఆ పైస్థాయి హోదా కలిగిన వారిని తిరుమల జెఇఒగా నియమించవచ్చు. దీనికి ఎటువంటి నిబంధనలు అడ్డురావు...! త్వరలో ఆయనను తిరుమల జెఇఒగా అశోక్‌కుమార్‌ను నియమిస్తారని విశ్వసనీయ సమాచారం. వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి అధికారో ఏ ఒక్కరికీ తెలియదు. కానీ ప్రస్తుత జెఇఒ శ్రీనివాసరాజు వ్యవహారశైలి 'అశోక్‌కుమార్‌' వ్యవహారశైలి ఒకే విధంగా ఉంటుందని ఆయన వ్యవహారశైలి తెలిసిన అధికారులు చెబుతున్నారు. 

   ఇంతకు ముందు తిరుమల జెఇఒగా పనిచేసిన అధికారుల్లో కొందరిపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. వారి వ్యక్తిగత వ్యవహారశైలి కూడా పలు విమర్శలకు కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో 'అశోక్‌కుమార్‌'ను తిరుమల జెఇఒగా నియమిస్తే ప్రభుత్వంపై పాలకులపై విమర్శలు వస్తాయనే అనుమానాలు టిటిడి వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. జెఇఒ పోస్టులో ఐఎఎస్‌ అధికారిని ముఖ్యంగా గతంలో జెఇఒగా బాధ్యతలు నిర్వహించి అన్నివర్గాల ప్రశంసలు పొందిన ప్రస్తుత పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ 'కాటంనేని భాస్కర్‌' వంటి అధికారిని నియమించాలని నిన్నటి వరకు 'చంద్రబాబు' భావించారు. ఒక వైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో 'అశోక్‌కుమార్‌' వైపే ఆయన మొగ్గుచూపుతారని అధికార వర్గాలు అంటున్నాయి. చివరకు 'చంద్రబాబు' 'భాస్కర్‌' వంటి అధికారిని ఎంపిక చేస్తారా...? లేక ఒత్తిడితో 'అశోక్‌కుమార్‌'నే నియమిస్తారా...? వేచి చూడాల్సి ఉంది.

(502)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ