WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'గంటా' కుమారుడి చిత్రం పేరు 'జయదేవ్‌'...!

ఆంధ్రప్రదేశ్‌ మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి  హీరోగా నటిస్తున్న చిత్రానికి ఈ రోజు టైటిల్‌ ఖరారు చేశారు. 'ఉగాది' సందర్భంగా వారు ఈ చిత్రానికి 'జయదేవ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి  హీరోగా 'జయంత్‌ సి.పర్జానీ' దర్శకత్వంలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. మంచి పోలీసు అధికారిగా 'రవి' ఇందులో కనిపించబోతున్నారట. ఉద్యోగం కోసం కుటుంబాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసే పాత్రలో 'రవి' మంచి నటన కనబర్చారని చిత్ర నిర్వాహకులు చెబుతున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్‌లు ఈ చిత్రానికి హైలెట్‌ అని నిర్మాత అశోక్‌కుమార్‌ అంటున్నారు. హీరోయిన్‌గా మాళవిక, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంకటేశ్వరరావు, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.


(507)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ