లేటెస్ట్

అసెంబ్లీలో 'చంద్రబాబు'పై తొలి నిమిషంలోనే మాటల 'దాడి'...!

మొన్నటి దాకా ముఖ్యమంత్రిగా ఉన్న 'చంద్రబాబునాయుడు'కు ప్రతిపక్షనాయకుడిగా..మారి...అసెంబ్లీలో తొలిసారి మాట్లాడుతున్న తొలి నిమిషంలోనే అధికారపక్షం నుంచి 'దాడి' మొదలైంది. అసెంబ్లీ స్పీకర్‌గా 'తమ్మినేని సీతారాం' ఎన్నిక అయిన అనంతరం సభను ఉద్దేశించి..సభా నాయకుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మాట్లాడిన వెంటనే ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షనేతగా ఉన్న 'చంద్రబాబునాయుడు' మాట్లాడడానికి లేచి నిలబడి మైక్‌ సరిచేసుకుంటున్న సమయంలో 'మైకు' వాల్యూమ్‌ పెంచాలని కోరడంతో..అధికారపక్షం నుంచి...ఒక్కసారిగా..మీరుపెట్టిన మైకులే అవి...సరిగా పనిచేయడం లేదు..? మీ పనితీరుకు ఈ మైకులు నిదర్శనం..అంటూ అధికారపక్ష సభ్యులు..గట్టిగా అరిచారు. దీనిపై 'చంద్రబాబు' స్పందిస్తూ...తాను గట్టిగానే మాట్లాడతానని, మైక్‌ వ్యాల్యూమ్‌ పెంచాలని మరోసారి కోరడం..అధికారపక్ష సభ్యులు..ఏవో వ్యాఖ్యలు చేయడంతో...స్పీకర్‌ సీతారాం..అధికారపక్ష సభ్యులను మౌనంగా ఉండాలని కోరడంతో..వారు మౌనాన్ని ఆశ్రయించడంతో...'చంద్రబాబు' తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతిపక్షనేతగా మారిన 'చంద్రబాబు'కు తొలి నిమిషంలోనే వైకాపా నుంచి 'దాడి' ప్రారంభం కావడంతో..రాబోయే రోజుల్లో అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంటుందో...? అధికారపక్ష సభ్యులు...'చంద్రబాబు'పై ఎలా దాడి చేయబోతారో..అనే దానికి ఇదే నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

(425)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ