WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి

దాదాపు ఎనిదిదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా హత్యకేసులో హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబు నిర్దోషని ప్రకటించింది. ఈ కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబుకు జీవిత ఖైదును విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రెండు సెక్షన్ల కింద మహిళా సెషన్స్ కోర్టు శిక్ష ఖరారు చేసింది.దీనిపై సత్యం బాబు హైకోర్టులో అపీలు చేయగా, వాదనలు విన్న కోర్టు, సంచలన తీర్పును ఇస్తూ, ప్రాసిక్యూషన్ వాదనలు అతడే దోషని నిరూపించడం లేదని అభిప్రాయపడింది. ఆధారాలు లేకుండా ఎనిమిదేళ్ల పాటు సత్యంబాబును జైల్లో పెట్టారని పోలీసులను మందలించింది. సత్యంబాబుకు రూ. లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అప్పట్లో కేసును విచారించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

   కోర్ట్ తీర్పుపై బాధితురాలు ఆయేషా మీరా తల్లి షంషాద్‌ బేగం హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఈ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అన్నారు. న్యాయ వ్యవస్థ మంచి తీర్పు ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. కోర్టు ఆదేశించినట్టు పోలీసులకు సత్యంబాబుకు లక్ష రూపాయలు కాదని, కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. తాను మొదటి నుంచి సత్యం బాబు నిర్దోషని చెబుతున్నానని ఆమె అన్నారు. అసలు నిందితులను వదిలేసి పోలీసులు నాటకాలాడారని, అసలు దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. విజయవాడలోని ఓ హాస్టల్ లో బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను అంత్యంత పాశవికంగా 2007లో హత్య చేసిన సంగతి తెలిసిందే.

(332)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ