WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకులకు మంత్రి పదవులా...?

పశ్చిమగోదావరి జిల్లా నుండి దళిత వర్గానికి చెందిన 'జవహర్‌'ను, బిసి వర్గానికి చెందిన మాజీ కాంగ్రెస్‌ వాది 'పీతాని సత్యనారాయణ'ను మంత్రి పదవుల్లోకి తీసుకోవడం ఆ జిల్లా ఎమ్మెల్యేలను పార్టీ నాయకులను ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లు అధికారం అనుభవించిన 'పీతాని'లో ఏం చూసి 'చంద్రబాబు' మంత్రి పదవి ఇచ్చారో దళిత వర్గానికి చెందిన 'జవహర్‌' పార్టీ కోసం ఏం చేశారని, పార్టీలో సీనియర్‌ నిజాయితీపరుడైన ఎమ్మెల్యే శివరామరాజుకు మంత్రి పదవి ఇవ్వకుండా 'పీతాని'కి ఇవ్వడం ఏమిటని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 'శెట్టిబలిజ' సామాజికవర్గానికి చెందిన 'రెడ్డి సుబ్రహ్మణ్యం'కు కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇచ్చారు కదా..! అదే సామాజికవర్గానికి చెందిన 'పీతాని'కి మంత్రి పదవి ఇవ్వడం ఏమిటి? జిల్లాలో కాపులు, కమ్మకులస్తులు,శెట్టిబలిజ వర్గాలకు చెందిన వారెవరికీ ఇవ్వకుండా ఆ ఇద్దరికీ పదవులు ఇచ్చి 'చంద్రబాబు' చేతులు కాల్చుకుంటారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.పార్టీపై పరోక్షంగా, జిల్లా యంత్రాంగంపై బాహాటంగా విమర్శలు చేసిన 'పీతాని సత్యనారాయణ'ను గతంలో పిలిచి తవ్రంగా మందలించిన 'చంద్రబాబే' నేడు మంత్రి పదవి ఇవ్వడం ఎంత వరకు సబబు అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అదృష్టం వరించి ఆఖరు నిమిషంలో పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పీతాని కన్నా జిల్లాలో అదృష్టవంతులు ఎవరు అని పలువురు పార్టీ సీనియర్లు వ్యంగ్యంగా దుయ్యబడుతున్నారు. జిల్లాలో మంత్రిగా గతంలో 'పీతల సుజాత'ను ఎంపిక చేసి తప్పు చేసిన 'చంద్రబాబు' మళ్లీ పాత బాటలో నడిచి రెట్టింపు తప్పు చేశారని పార్టీ వర్గాలు దుయ్యబడుతున్నాయి.

(554)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ