WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బొజ్జల'కు సన్‌స్ట్రోక్‌...!

తన ఆరోగ్యం బాగాలేదని, తాను పనిచేయలేకపోతున్నానని కొంత మంది కాలాలనే ప్రచారం చేయించారని, దాంతో తనను మంత్రి పదవి నుంచి తొలగించారని దీంతో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని మాజీ మంత్రి బొజ్జల ప్రకటించి జరిగిన తప్పులను వెనకేసుకొస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత మూడేళ్లలో పేరుకే 'బొజ్జల' మంత్రి. పెత్తనమంతా ఆయన కుమారుడిదే...పోలీసు అధికారులు, రెవిన్యూ, ఎక్సైజ్‌, బిసి కమర్షియల్‌ శాఖ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు మొత్తం 'బొజ్జల' కుమారుని కనుసన్నల్లోనే జరిగాయని వీటి వెనుక భారీ ఎత్తున్న ధనం చేతులు మారిందని పలువురు అధికారపార్టీనాయకులు గతంలోనే 'చంద్రబాబు'కు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా భూ వివాదాల్లో కలగచేసుకోవడమే కాకుండా, రాజధాని అమరావతి భూములు, విశాఖపట్నం భూముల్లో కలుగ చేసుకుని లబ్దిపొందారనే విమర్శలు ఉన్నాయి. నిన్నటి వరకు మంత్రి బొజ్జలతో పని కావాలంటే ఆయన కుమారుని కలిస్తే చాలనే విధానం ఉంది. గతంలో 'బొజ్జల' నిజాయితీపరుడనే మంత్రిగా పేరుతెచ్చుకున్నా ఇటీవల కాలంలో ఆయన కుమారుడి జోక్యంతో అప్రదిష్టపాలై అవినీతి ఆరోపణలతో అమాత్యపదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగున్నా...బాగాలేకున్నా...ఆయన కుమారుని వ్యవహారశైలే 'బొజ్జల'కు నష్టం చేకూర్చిందని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆప్‌ ది రికార్డుగా చెబుతున్నారు. 

  'బొజ్జల' కుమారుని ప్రమేయం గత ఏడాది నుంచి అనేక సందర్బాల్లో బయటపడినా...మౌనం వహించిన మంత్రి పదవి పోగానే కొత్త బాణిని వెతుకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలువురు మంత్రుల కుమారులతో,బంధువులతో మంత్రి బొజ్జల కుమారుడు అనేక భూ పంచాయితీలు నిర్వహించి ఆర్థిక లబ్దిపొందారని ఈ విషయం ఆయనకు తెలిసినా ఒక వేళ తెలిసీ తెలియనట్లు నటించినా పరిస్థితి దారుణంగా ఉండడంతో 'చంద్రబాబు' బొజ్జలపై వేటు వేసి ఉంటారని కొందరు సీనియర్‌ మంత్రులు చెబుతున్నారు.ఈ విషయంపై 'బొజ్జల' సన్నిహితులు స్పందిస్తూ తమ మంత్రిగారి కుమారుడు అధికార వ్యవహారాల్లో ఎక్కువగా కలుగ చేసుకున్నారని, ఆర్థిక లబ్ది కోసం కాదని, ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న మంత్రుల కుమారు, బంధువులు అధికార వ్యవహారాల్లో కలుగచేసుకుని లబ్దిపొందలేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. 1989లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన 'బొజ్జల' 94,99,2009,2014లో విజయం సాధించారు. 2004లో మాత్రమే ఆయన ఓటమిచెందారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక టిడిపితో ఆయన రాజకీయ ప్రస్తానం ముగిసినట్లేనని పలువురు టిడిపి నాయకులు చెబుతున్నారు.

(442)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ