WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్యే,విప్‌ పదవులకు 'చింతమనేని'రాజీనామా...!

తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు వీరవిధేయుడు, దూకుడుగా మాట్లాడే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎమ్మెల్యే పదవికి, విప్‌ పదవికి రాజీనామా చేయబోతున్నారు. పదేళ్లు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని భుజానవేసుకుని ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తనతో పాటు మరెందరో సీనియర్లు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన(అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అధికారం అనుభవించిన పీతాని సత్యనారాయణ) ఎన్నికలకు ముందు వరకు ప్రభుత్వ టీచర్‌గా బాధ్యతలు నిర్వహించిన 'జవహర్‌'కు మంత్రి పదవి ఇవ్వడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 'చంద్రబాబు' తీవ్రంగా దుయ్యబట్టడమే కాకుండా టిడిపి పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేసి,వైఎస్‌ కుటుంబానికి వీరవిధేయుడైన 'పీతాని'కి మంత్రి పదవి ఇవ్వడం 'పశ్చిమగోదావరి' జిల్లాలో ఏ ఒక్కరికీ మింగడుపడడం లేదని 'చింతమనేని' అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలే కాకుండా, పార్టీపట్ల, నాయకునిపట్ల విధేయతలేని నాయకులకు మంత్రి పదవులా...? అని 'చింతమనేని' వర్గీయులు దుయ్యబడుతున్నారు. 

   ఒకవైపు నిజాయితీ, సమర్థత, విధేయత ఉండాలని పదే పదే వళ్లిస్తున్న చంద్రబాబు ఆ లక్షణాలు లేని 'జవహర్‌,పీతాని'లకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు. నిజాయితీగా పనిచేసే అధికారులపై కులముద్రలు వేసి, నర్మగర్భంగా బాహాటంగా ఆఫ్‌ ది రికార్డుగా తీవ్రంగా దుయ్యబట్టిన 'పితాని'కి మంత్రి లభిస్తుందని కలలో కూడా తాము భావించలేదని అధికార, ఉద్యోగవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నిజాయితీపరులైన అధికారులను విమర్శిస్తూ, సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించేవారిపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని వారు అంటున్నారు. పార్టీకి వారు చేసిన సేవ ఏమిటి...? మూడేళ్లలో వాళ్లు ఒరగబెట్టింది ఏమిటి...? వారిద్దరి వ్యవహారశైలి ఏమిటి...? వారిద్దరూ ఎన్ని ప్రజా సమస్యలను నిజాయితీగా పరిశీలించి పరిష్కరించారు...? దమ్ముంటే బాహాటంగా చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. నిజాయితీపరులు, సమర్థతకలిగిన వారు అయిన 'క్షత్రియ' సామాజికవర్గానికి చెందిన 'శివరామరాజు'కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై రాజకీయ, అధికారవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 'చింతమనేని' రాజీనామా చేశారని, ఎవరు చెప్పినా ఆయన వినరని, రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తేలేదని ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. ఏ విధంగా 'చింతమనేని' ఆగ్రహానికి 'చంద్రబాబు' చల్లారుస్తారే వేచి చూడాల్సిందే...!

(771)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ