WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మాగుంట'కు పదవెందుకు రాలేదో...?

ఆపార రాజకీయ అనుభవంతో పాటు పలుసార్లు ఒంగోలు ఎంపిగా విజయం సాధించిన మాగంటి శ్రీనివాసరెడ్డి 2014 ఎన్నికల సమయంలో టిడిపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించారు. రెండోసారి కూడా ఎమ్మెల్సీగా విజయం సాధించిన మాగుంటకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మాటకూడా ఇచ్చారని కొద్ది నెలల కిందటకు పొక్కింది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తమ నాయకునికి మంత్రి పదవి దక్కడం ఖాయమని భావించిన మాగుంట అనుచరులకు తాజా పరిణామాలు మింగుడుపడడం లేదు. వ్యాపారపరంగా ఆస్తులు సంపాదించుకుని, రాజకీయపరంగా ఆస్తులు పోగొట్టుకున్న తమ నాయకుని చంద్రబాబు ఇచ్చిన ఖరీదైన కానుక ఇదేనని ఆయన అనుచరులు విమర్శిస్తున్నారు. దీనిపై 'మాగుంట' స్పందించడానికి సుముఖంగా లేరు. నెల్లూరు జిల్లాకు చెందిన కీ.శే.మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన నక్సలైట్ల దాడికి బలయ్యారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చిన 'మాగుంట శ్రీనివాసరెడ్డి' 2004, 2009లో ఒంగోలు ఎంపిగా విజయం సాధించారు. 'మాగుంట'కు మంత్రి పదవి ఖాయమని ఓంగోలు, నెల్లూరుకు చెందిన మాగుంట అభిమానులు భావించినప్పటికీ ఆఖరు నిమిషంలో అంతా తారుమారైంది. ఎక్కడేం జరిగిందో కానీ..ఆయన సామాజికవర్గానికి చెందిన వారికి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ 'మాగుంట'కు మాత్రం అవకాశం రాలేదు. మంత్రి పదవి దక్కకపోవడంపై మరికొన్ని రోజులు వేచి చూస్తే కాని బయటకు రాదు.

(371)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ