లేటెస్ట్

ఇస్లామిక్‌ స్టేట్‌ను అంతమొందిస్తాం : బరాక్‌ ఒబామా

వాషింగ్టన్‌ : ఇస్లామిక్‌ స్టేట్‌ను అంతమొందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. ఐఎస్‌ తనంతటతానే బలహీనపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఎస్‌ సంస్థ ఇప్పుడు ఇరాక్‌, సిరియాలో ఆత్మరక్షణలో పడిందని అన్నారు. సీఐడీ హెడ్‌ క్వార్టర్స్‌లో భద్రతాధికారులతో సమావేశం అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఐఎస్‌ నెట్‌ వర్క్‌ను తుదిముట్టిస్తామని అన్నారు. అరబ్‌ దేశాలతో సహా 66 దేశాలు సభ్యులుగా ఉన్న సంకీర్ణ కూటమి ఐఎస్‌ మూలాలు నాశనం చేయడానికి కృషి చేస్తోందని అన్నారు. ఇటీవల కాలంలో అమాయక మహిళలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని ఐఎస్‌ దాడులు జరుపుతోందని, దీంతో ఐఎస్‌ఐపై వ్యతిరేకత పెరుగుతోందని ఒబామా అన్నారు. ఇరాక్‌, సిరియాలో ఐఎస్‌ తీవ్రవాద సంస్థ నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్నా... అది సాధ్యం కావడం లేదని ఒబామా అన్నారు. కొన్ని నెలలుగా మిత్ర దేశాలతో కలిసి అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్‌ తమ కీలక నేతలను కోల్పోయిందని ఒబామా అన్నారు. ఐఎస్‌ ఆర్థిక మూలలను పూర్తిగా నాశనం చేస్తామని అన్నారు. చమురు ద్వారా వారికి వచ్చే రాబడిని ఇప్పటికే గణనీయంగా తగ్గించామని ఒబామా తెలిపారు. సిరియా సంక్షోభానికి ముగింపు పలకాలటే ఐఎస్‌ అంతకం కావడం ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందు కోసం దౌత్యంతోపాటు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నామని అన్నారు.

(849)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ