WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గరికపాటి'పై గుంటూరులో ఆగ్రహం...!

మంత్రి పుల్లారావు పదవి పోకుండా, చినబాబు ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో...రాజ్యసభ సభ్యుడు 'గరికపాటి రాంమ్మోహన్‌రావు' పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన 'గరికపాటి' గుంటూరు రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆయన తెలంగాణలో పార్టీనీ బలోపేతం చేయకుండా...గుంటూరు పార్టీ రాజకీయాల్లో వేలు పెట్టడం ఏమిటని వారు అంటున్నారు. పార్టీలో గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తూ..పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని వారు అంటున్నారు. పుల్లారావుతో వ్యాపారభాగస్వామం ఉండడం వల్లే 'పుల్లారావు' మంత్రి పదవిని ఆయన కాపాడుతున్నారా...? అని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో 'గరికపాటి' కనిపిస్తే కొట్టే పరిస్థితులు పార్టీలో ఉన్నాయి. ఆయన కొద్ది రోజులు గుంటూరులో కనిపించకుండా ఉంటే మంచిదని కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. గుంటూరు పార్టీని నాశనం చేసేందుకే 'గరికపాటి' కంకణం కట్టుకున్నారా...? 2014 ఎన్నికలకు ముందు ఆయన వరంగల్‌ జిల్లాలో పార్టీ అభ్యుర్థుల విజయానికి కృషి చేయకుండా గుంటూరులో తిష్టవేయటంతో పార్టీ గెలవాల్సిన ఎంపిసీటు, రెండు ఎమ్మెల్యే సీట్లు ఓడిపోలేదా?గుంటూరులో 'గరికపాటి'కి ఏంపని. ఇప్పుడు కనుక ఆయన గుంటూరులో కనిపిస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఆయనే ఊహించలేరు. ఏది ఏమైనప్పటికీ 'పుల్లారావు'ను మంత్రి పదవిలో కొనసాగించడం మెజార్టీ వర్గాలకు ఇష్టం లేదని జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఒక్కరికే ఐదేళ్లు పదవి ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏమిటి? ఇప్పటికైనా గుంటూరు జిల్లాలో 'గరికపాటి' జోక్యం వద్దని అధినేతకు చెప్పబోతున్నారు.

(614)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ