WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

ఏపిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై గవర్నర్ నరసింహన్ కు విపక్ష నేత , వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్రపతిని కూడా కలుస్తామని ఆయన తెలిపారు. ఇలా మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించామని జగన్ చెప్పారు.తెలంగాణలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇదేవిధంగా పార్టీ మారి.. మంత్రి పదవి పొందినప్పుడు.. ఇదే చంద్రబాబు నాయుడు ఏమాటలు మాట్లాడారు గుర్తుతెచ్చుకోండి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ప్రమాణం స్వీకారం చేయడమంటే.. రాజకీయ వ్యభిచారమేనని నాడు చంద్రబాబు పోల్చారు.అదే చంద్రబాబు నేడు చేస్తున్న చేష్టలు సబబేనా గవర్నర్‌ను అడిగామని ఆయన అన్నారు. స్పీకర్ కూడా అరవైఆరు మంది వైసిపి ఎమ్మెల్యేలు అని శాసనషభలో ప్రకటిస్తారని, ఆయన ఫిరాయింపుదారులను రక్షించే పనిలో ఉన్నారని జగన్ విమర్శించారు

(138)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ