WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌

రిలయన్స్ జియో తన వినియోగదారులకు జియో సమ్మర్ సర్‌ప్రైజ్ పేరిట మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రైమ్ మెంబర్ షిప్ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించగా, ఇప్పుడు తాజాగా కొత్త ఆఫర్‌తో వినియోగదారులను మరింత ఆకర్షించనుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన వారు నెలకు రూ.303 లేదా రూ.499తో రీచార్జి చేసుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో కొనసాగేందుకు వీలుండగా, సదరు రీచార్జిల వాలిడిటీ 90 రోజుల వరకు లభించనుంది. అంటే ఈ నెల 15వ తేదీ లోపు రూ.303 లేదా రూ.499తో రీచార్జి చేసుకునే జియో యూజర్లు ఆ ప్యాక్‌లను నెల రోజుల పాటు కాకుండా 3 నెలల వరకు వాడుకోవచ్చు. 3 నెలల వరకు ఆయా ప్యాక్‌లకు వాలిడిటీ ఉంటుంది. ఆ తరువాతే మళ్లీ నెలకోసారి రీచార్జి చేసుకోవాలి. 

  ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన వారు మొదటి సారి ఆ ప్యాక్‌లను రీచార్జి చేసుకుంటే ఈ ఆఫర్ వర్తించనుంది. అంటే ప్రస్తుతం రూ.303 లేదా రూ.499తో రీచార్జి చేసుకుంటే ఆ ప్యాక్‌లను 3 నెలల పాటు అంటే ఏప్రిల్, మే, జూన్ చివరి వరకు వాడుకోవచ్చు. మళ్లీ జూలైలో రీచార్జి చేసుకోవాలి. అదేవిధంగా రూ.999 ఆపైన రీచార్జిలు అన్నింటికీ 3 నెలల పాటు అదనంగా మరో 100 జీబీ డేటా లభించనుంది. ఈ క్రమంలో జియో ప్రకటించిన తాజా ఆఫర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

(251)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ