WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్వరలో బాహుబలి రాబోతున్నాడు

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పెద్దగా కలిసి సాగకపోయినప్పటికీ తమదైన శైలిలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాకు కోమటిరెడ్డి బ్రదర్స్ తమ ఉనికి విస్తృత పర్చుకునే ఎజెండాను క్రియాశీలంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలుగా గుర్తింపు పొందే క్రమంలో జిల్లాల పర్యటన మొదలుపెట్టుకున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై గురిపెట్టి విమర్శలు చేసిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు యుద్ధం మొదలైందని ప్రకటించారు. అంతేకాదు కేసీఆర్ భవిష్యత్ గురించి సైతం జోష్యం చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ లో జూనియర్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత - ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఆసక్తికరమైనవ్యాఖ్యలుచేశారు.

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో యుద్ధం మొదలైందని ఆ యుద్ధంలో కాంగ్రెస్ దే గెలుపు తథ్యమని ప్రకటించారు. తనలాంటి నాయకుడు కేసీఆర్ కు భయపడేది లేదన్నారు. తామేంటో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో చూపించామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు - కార్యకర్తలు ఐక్యంగా ఉంటే కేసీఆర్ కాంగ్రెస్ ను ఏమీ చేయలేరని తోక ముడుచుకొని ఇంట్లో కూర్చోక తప్పదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సీఎల్పీ నాయకుడు జానారెడ్డి చెప్పిన మాటలు వాస్తవమేనని ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓ బాహుబలి రానున్నాడని రాష్ట్ర కాంగ్రెస్లో మార్పులు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా తన మనసులోని మాటలను వెల్లడించారు.

(197)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ