లేటెస్ట్

టిటిడి బోర్డు మెంబర్‌గా 'దరువు' 'క‌ర‌ణ్ రెడ్డి'.....!

'దరువు' అనే వెబ్‌సైట్‌ ఓనర్‌ 'క‌ర‌ణ్ రెడ్డి' టిటిడి మెంబర్‌ కాబోతున్నారట. త్వరలో నూతనంగా ఏర్పాటు చేయబోయే టీటీడీ బోర్డులో ఆయనకు స్థానం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన వెబ్‌సైట్‌ ద్వారా ఆయన వైకాపాకు అనుకూలంగా వార్తలు రాశారు. గత ఐదేళ్ల నుంచి ఆయన చేస్తోన్న శ్రమను గుర్తించిన వైకాపా అధినేత వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ఆయనను టిటిడి బోర్డు సభ్యుడిగా నియమించడానికి అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వైకాపాకు అనుకూలంగా, టిడిపి,చంద్రబాబు, ఆయన కుమారుడిని ఎద్దేవా చేస్తూ...పలు వార్తలను 'దరువు' వెబ్‌సైట్‌ రాసింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని పదే పదే సర్వేలను ప్రకటించింది.. వైకాపాకు మేలు చేసింది. ఆయన తనకు చేసిన మేలు, సామాజిక,ప్రాంతీయతను గుర్తించి...టిటిడి బోర్డు మెంబర్‌గా ఆయనను నియమించాలని వైకాపా పెద్దలు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా..'దరువు'వెబ్‌సైట్‌ యజమాని 'క‌ర‌ణ్ రెడ్డి' తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కూడా అత్యంత ఆప్తులు. తెలంగాణ ఎన్నికల సమయంలో 'కెసిఆర్‌' పార్టీకి అనుకూలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినందుకు...యాడ్స్‌ రూపేణా కోట్లాది రూపాయలను 'దరువు' యజమానికి చెల్లించారట. ఇదే కాకుండా..'క‌ర‌ణ్ రెడ్డి' చేసిన సేవలకు కాను..ఆయనకు టిటిడి బోర్డు మెంబర్‌ ఇప్పిస్తానని కెసిఆర్‌ హామీ ఇచ్చారని తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 'క‌ర‌ణ్ రెడ్డి''ని టిటిడి సభ్యులుగా అవకాశం ఇవ్వాలని 'జగన్‌' కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు 'కెసిఆర్‌' చెబుతారని.. కరుణరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద..తనను నమ్ముకున్న వారికి 'జగన్‌'న్యాయం చేస్తారన్నమాట...'దరువు' యజమాని విషయంలో మరోసారి నిజమైంది.

(630)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ