WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'జవహర్‌'ది ప.గో జిల్లా కాదట...!

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎక్సైజ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్యామేల్‌ జవహర్‌ ఆ జిల్లాకు చెందిన వారు కాదట. ఆయన పుట్టింది..పెరిగింది కృష్ణా జిల్లాలోనట. ఆయన స్వంత గ్రామం తిరువూరు నియోజకవర్గంలో ఉంది.  ఆయన సోదరుడు కె.రవీంద్రనాథ్‌ 1989లో టిడిపి అభ్యర్థిగా తిరువూరు నుంచి పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉద్యోగ రీత్యా పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని నాయకుల దృష్టిని ఆకర్షించారు. ఆయనకు కొవ్వూరు టిక్కెట్‌ ఇప్పించి ఎపిఎన్‌జిఒలకు చెందిన నేతలేనట. కృష్ణా జిల్లాకు చెందిన పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగం రావటం ఏమిటి...? ఆయనకు అక్కడ ఎమ్మెల్యే సీటు రావడం ఏమిటి? తరువాత మంత్రి కావడం ఏమిటి? ఇదంతా స్థానిక నాయకులకు అన్యాయం చేయటం కాదా? అని ఆ జిల్లాకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  పదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవితం గడిపిన 'జవహర్‌'కు రాజకీయ అదృష్టలక్ష్మి వరించి మంత్రిని చేసింది. అంతే కాకుండా ఆయనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎక్సైజ్‌శాఖ ఆయనకు దక్కింది. జిల్లాకు చెందిన స్థానికులకు మంత్రి పదవి ఇవ్వకుండా పొరుగు జిల్లా వారికి మంత్రి పదవి ఇచ్చి తమ జిల్లా కోటాగా ప్రకటించడం ఎంత వరకు సబబు అని ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయనకు ఎంత మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయో కానీ...ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆయన ప్రజాభిమానం పొందారో లేదో తెలియదు కాదు..కానీ..'చంద్రబాబు' అభిమానాన్ని ఎలా పొందారో ఆ జిల్లా వాసులకు అంతుపట్టడం లేదు. కానీ మంత్రి పదవితో పాటు ఆదాయవనరులు కలిగిన ఎక్సైజ్‌శాఖ మంత్రి పదవి ఆయనకు దక్కింది. జిల్లా స్థానికులకు మరో రెండేళ్ల వరకూ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనుచూపుమేర కనిపించడం లేదు...!


(616)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ