లేటెస్ట్

శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ 7వ శాఖ ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రముఖ నేత్ర వైద్యశాల  గా గుర్తింపు పొందిన శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ మరియు లేజర్ సెంటర్  7 వ శాఖ ఇటీవల వైభవంగా హైదరాబాద్  లోని   ఖైరతాబాద్ గల వాసవీ  హాస్పిటల్ ప్రాంగణంలో వైభవంగా ప్రారంభం.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ,ఖైరతాబాద్  ఎమ్మెల్యే   దానం నాగేందర్,ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్  ,ఖైరతాబాద్  కార్పోరేటర్  విజయారెడ్డి , వాసవీ  హాస్పిటల్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్త,ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేష్  ,కోశాధికారి మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా  తదితరులు విచ్చేశారు. శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ మరియు లేజర్ సెంటర్ వ్యవస్థాపకులు  డాక్టర్ పల్లపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథులు చేతుల మీదుగా శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ మరియు లేజర్ సెంటర్ ఖైరతాబాద్ శాఖను   ప్రారంభించారు.ఈ సందర్బంగా   మంత్రి తన్నీరు హరీశ్ రావు  మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్  నగరంలో శ్రీ నేత్రాలయ ఐ  హాస్పిటల్ మరియు లేజర్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ పల్లపు   శ్రీనివాసరావు చేస్తున్న సేవలను కొనియాడారు. డాక్టర్ పల్లపు   శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ  నేత్రాలయ ఐ హాస్పిటల్ మొదటి శాఖను 2010 సంవత్సరంలో హైదరాబాద్ లోని   కొత్తపేటలో  ప్రారంభించడం జరిగిందని,తదనంతరం సంతోష్ నగర్,  మల్కాజ్‌గిరి , సుచిత్ర, కొండాపూర్, నిజామాబాద్ ప్రాంతాల్లో శ్రీ నేత్రాలయ ఐ   హాస్పిటల్ మరియు లేజర్ సెంటర్ శాఖలను ప్రారంభించడం జరిగిందని,7 వ  హాస్పిటల్   నేడు ముఖ్య అతిథుల చేతులమీదుగా ఖైరతాబాద్ లో  ప్రారంభించడం ఆనందంగా సంతోషంగా ఉందని,    మా అన్ని హాస్పిటల్లో అన్ని రకాల హెల్త్ కార్డులతో పాటు, ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు డాక్టర్ పల్లపు శ్రీనివాసరావు తెలియజేశారు.శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ మరియు లేజర్ సెంటర్ ఖైరతాబాద్ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా వ్యవస్థాపకులు డాక్టర్ పల్లపు శ్రీనివాసరావును వారి ఆత్మీయులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో విచ్చేసి  ఆయన ను  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ