WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఈజిప్ట్‌ చర్చిలో పేలుడు 21 మంది మృతి

ఈజిప్ట్‌ టన్టా పట్టణంలోని మార్‌ గర్జెస్‌ కోప్టిక్‌ చర్చిలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి పేలుడు పదార్థాలతో వచ్చి చర్చిలో తనని తాను పేల్చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈజిప్ట్‌ రాజధాని కైరోకు 120 కిమీలు దూరంలో ఉన్న ఈ చర్చి ఆ దేశంలోనే అతిపెద్దది. సహాయక బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రుల కోసం మిలిటరీ ఆస్పత్రులు వెంటనే తెరవాలని అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా ఆదేశించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చర్చి చుట్టూ భారీ బందోబస్తు విధించారు.ఈజిప్ట్‌లోని మైనారిటీ క్రైస్తవులను ఐసిస్‌ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. 2013లో ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా ముస్లిం అయిన మహమ్మద్‌ మోర్సి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈజిప్ట్‌లో గొడవలు చోటుచేసుకోవడంతో అప్పట్లో ఆర్మీ జనరల్‌గా పనిచేస్తున్న అబ్దెల్‌ ఫత్తా నాటి అధ్యక్షుడు మోర్సిని పదవి నుంచి తప్పించి అధికార బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి ఈజిప్ట్‌లో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. 2016 డిసెంబర్‌లో ఇదే చర్చిలో జరిగిన పేలుడులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

(161)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ