WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పార్టీ ఫిరాయింపులు కొత్తేమీకాదు: డొక్కా

 వైసీపీ అధినేత జగన్‌పై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పార్టీ ఫిరాయింపుల అంశం ఓ రాష్ట్రానికో.. పార్టీకో పరిమితమైనది కాదని ఎమ్మెల్సీ డొక్కా అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు కొత్తేమీకాదని, ఆ అంశాన్ని జగన్ భూతద్దంలో చూస్తున్నారని చెప్పారు. ఫిరాయింపులపై న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. పటిష్టమైన చట్టం తెస్తే తప్పా, ఫిరాయింపులను ఎవరూ ఆపలేరని తెలిపారు. జగన్ ఇకనైనా పార్టీ ఫిరాయింపులను వదిలిపెట్టి రాష్ట్ర సమస్యలపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు. పార్టీ ఫిరాయింపుల చట్టంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని.. దీనిపై పార్లమెంటులో చర్చించి లొసుగులుంటే సవరించాలన్నారు. ఈ విషయంలో జగన్‌ గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. జగన్‌ తానేదో నీతిమంతుడైనట్లు.. ఇతరులపై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్న నినాదంతో గుంటూరులో ఈనెల 14 వరకు సామాజిక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

(315)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ