WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టారిఫ్ ప్లాన్స్‌ అప్‌డేట్ చేయనున్న జియో

వెల్‌కం ఆఫ‌ర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫ‌ర్ల‌తో ఊహించ‌నంత మంది వినియోగ‌దారుల‌ను సంపాదించుకున్న రిల‌య‌న్స్ జియో తాజాగా స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ట్రాయ్ అభ్యంత‌రం చెప్ప‌డంతో ఆ ఆఫ‌ర్‌ను ఇప్ప‌టికే రీఛార్జ్ చేసుకున్న‌ వారికే ప‌రిమితం చేసింది. అయితే, ఈ నెల 16 నుంచి టారిఫ్ ప్లాన్‌లు అమ‌లులోకి రానున్న నేప‌థ్యంలో జియో తాజాగా మ‌రో ప్ర‌క‌టన చేసింది. టారిఫ్ ప్లాన్స్‌ను అప్‌డేట్ చేస్తున్నామని, త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని తెలిపింది. దీనితో ప్ర‌త్య‌ర్థి టెలికాం సంస్థ‌ల్లో మ‌ళ్లీ ఆందోళ‌న రేపింది. జియో అతి త‌క్కువ ధ‌ర‌ల‌తో టారిఫ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తుందా? అనే ప్ర‌శ్న జియో యూజ‌ర్ల‌తో పాటు టెలికాం రంగంలో చ‌ర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉచిత ఆఫర్లతో టెలికాం సెక్టార్ ను హోరెత్తించిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మరిన్ని అద్భుత ఆఫర్లు ఇవ్వడానికి సిద్దమవుతుంది. త్వరలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్లు ప్రకటించనుందని కంపెనీ తన వెబ్ సైట్లో వెల్లడించింది. కొత్త కస్టమర్లకు ఆల్ట్రా-అఫోర్డబుల్ డేటా టారిఫ్స్ తో పాటు, జియో ప్రైమ్ మెంబర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ''త్వరలోనే మేము మా టారిఫ్ ప్యాక్స్ ను అప్ డేట్ చేస్తాం. మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతాం'' అని ముంబాయికి చెందిన ఈ కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఇస్తున్న పోటీని తగ్గకుండా ఇవ్వడానికి, కొత్త సబ్‑స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కొత్త టారిఫ్ స్కీమ్ ను తాము లాంచ్ చేస్తామని జియో అధికార ప్రతినిధి కూడా పేర్కొన్నారు.

జియో ఇటీవల తీసుకొచ్చిన సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ దెబ్బకొట్టడంతో ఈ ప్రభావం యూజర్ల మీద పడకుండా ఉండేందుకు ఈ ప్లాన్స్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ గడువు 15 రోజుల పొడిగింపుతో పాటు రూ.303 ప్యాక్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలలు ఉచిత సేవలను అందించనున్నట్టు పేర్కొంటూ జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను తీసుకొచ్చింది. కానీ ఆ ఆఫర్ ను వెంటనే విత్ డ్రా చేసుకోమని జియోను ట్రాయ్ ఆదేశించింది. జియో ఆఫర్ల వెల్లువతో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీలో ఇతర ఆపరేటర్లు చుక్కలు చూస్తున్నారు. సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ చెక్ పెట్టడంతో వారు కొంత ఉపశమనం చెందారు. కానీ వారికి మరింత ఝలకిస్తూ మళ్లీ టారిఫ్ ప్లాన్స్ ను అప్ డేట్ చేయబోతున్నట్టు ప్రకటించింది.

 

(222)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ