WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రయాణీకులకు గణనీయంగా ఆకట్టుకుంటున్న రైల్వేలు...!

ప్రజా రవాణాలో భారతీయ రైల్వే  మరో రికార్డు సృష్టించింది. భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణీకులను తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ సంస్థ 2016-17 సంవత్సరంలోనూ గణనీయంగా ప్రయాణీకులను ఆకట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8221 మిలియన్ల ప్రయాణీకులు భారతీయ రైళ్లలో ప్రయాణించారు. గత సంవత్సరం ఈ సంఖ్య 8151 మిలియన్లుగా రికార్డు సృష్టించగా ఈసారి దాన్ని రైల్వేలు అధిగమించాయి. ప్రపంచంలోని అతిపెద్ద నెట్‌వర్క్‌లలో నాలుగవ స్థానాన్ని పొందిన మన భారతీయ రైల్వే రమారవి 13500 రైళ్లను ప్రతిరోజు నడుపుతూ జాతి సేవలో నిరంతరం నిమగ్నమైంది.  ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ప్రయాణీకుల ఛార్జీల ద్వారా ఆదాయం గరిష్టంగా రూ.47400కోట్లు సాధించింది. వాస్తవానికి గత ఏడాదికంటే రూ.2వేల కోట్లు ఆదాయాన్ని అధికంగా ఆర్జించింది. రైల్వే మంర్తర సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు ప్రవేశపెట్టిన ప్రగతిశీల భావాలున్న పాలసీలు ఆచరణలో పెట్టడం ద్వారానే ఇది సాధ్యమైంది. 

  కాగా ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు 87కొత్త రైలు సర్వీసులను ప్రవేశపెట్టింది. 51రైళ్ల ప్రయాణదూరం పెంచుతూ గమ్యస్థానాలను పొడిగించింది. ఐదు రైళ్ల సర్వీసుల ప్రయాణ టిప్పులను పెంచింది. ఇందులో నాలుగ హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, రెండు అంత్యోదయ రైళ్లు, 10 డెమూలు మరియు 5 మెమూలు కలసి ఉన్నాయి. ఈ సంవత్సరం 589 బోగీల సంఖ్యను పెంచారు. పండుగుల/ప్రత్యేక దినోత్సవాల సందర్భాల్లో 31438 ట్రిప్పులను ప్రత్యేక రైళ్లను నడిపింది. 293 కొత్తస్టాపులను ఏర్పాటు చేసి ప్రయాణీకులను ఆకట్టుకున్నారు. దాదాపు 350 రైళ్లకు వేగాన్ని పెంచారు. కొత్తగా ఎల్‌.హెచ్‌.బి. బోగీలను ఏర్పాటు చేయడం జరిగింది. టికెట్‌ చెకింగ్‌ ద్వారా గత సంవత్సరం కంటే రూ.58కోట్లు అధికంగా ఆదాయాన్ని ఆర్జించింది.


(341)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ