గతేడాది నవంబరు 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాతి నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో 10లక్షల స్వైపింగ్ యంత్రాలు పెరిగినట్టు భారతీయ స్టేట్ బ్యాంకు తెలిపింది. కార్డు పేమెంట్స్‌ను అంగీకరిస్తున్న షాపుల సంఖ్య 15 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగినట్టు పేర్కొంది. ఫలితంగా కరెన్సీ అవసరం రూ.లక్ష కోట్లు తగ్గినట్టు తెలిపింది. నోట్ల రద్దుకు ముందు అక్టోబరు నాటికి దేశంలో 15.1 లక్షల క్రెడిట్ కార్డ్ స్వైప్ యంత్రాలు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 22.2 లక్షలకు చేరుకుంది. వీటిలో ఎస్బీఐ ఒక్కటే గత నాలుగు నెలల్లో 1.24 యంత్రాలను ఏర్పాటు చేసింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు ఒక్కొక్కటి 1.18 లక్షల పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను ఏర్పాటు చేశాయి. కార్పొరేషన్ బ్యాంకు 80,822, ఐసీఐసీఐ 67 వేల పీవోఎస్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఫలితంగా రూ. 1.17 లక్షల కోట్ల విలువైన నోట్లను ముద్రించాల్సిన అవసరం లేకుండా పోయిందని ఎస్బీఐ చీఫ్ ఎకానమిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. డెబిట్ కార్డు వినియోగం పెరగడంతోపాటు మొబైల్ ట్రాన్సాక్షన్స్ 36 శాతం పెరిగినట్టు ఘోష్ తెలిపారు. కాగా, సెప్టెంబరు 2018 నాటికి మరో 30 లక్షల దుకాణాల్లో ఎలక్ట్రానిక్ పేమెంట్స్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ