WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బిసిలు లేక‌పోతే టిడిపి లేదు....!

బీసీలకు అండగా, అన్నగా ఉంటానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం విశాఖలోని ఏయూలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌, జ్యోతిరావుపూలే, అంబేద్కర్‌ వంటి మహానుభావుల స్ఫూర్తితో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు. సమాజం కోసం జ్యోతిరావు పూలే రాజీ లేని పోరాటం చేశారని, తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడని ప్రశంసించారు.  బీసీలే టీడీపీకి వెన్నెముక అని, బీసీలు లేకపోతే టీడీపీ లేదని ఆయన అన్నారు..కష్ట కాలంలో పార్టీని ఆదుకున్న వారు బీసీలేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్టీఆర్‌ విద్యోన్నతి ద్వారా పేద విద్యార్థులకు విద్య అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు తెలుగుదేశం పార్టీకి బీసీ వర్గాలే వెన్నెముక అని, కోర్టుల చుట్టూ తిరిగే నాయకులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు

(259)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ