WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

 హనుమాన్‌ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘంగా జరిగాయి.ఉదయం నుండి భక్తులు దీవలయలకు వెళ్లి హనుమంతునికి ప్రత్యెక పూజలు నిర్వహించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిట కిట లాడాయి.హైదరాబాద్‌ నగరం లో ఎక్కడచూసినా కాషాయ రంగు జండాలు మిలమిలలాడాయి.నగరం లోని లోని కర్మాన్‌ఘాట్‌ ప్రసన్నాంజేయ స్వామి దేవాలయం నుంచి శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ శోభాయాత్రంలో సుమారు 2వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ యాత్ర చంపాపేట, సైదాబాద్‌, సరూర్‌నగర్‌ చెరువుకట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చాదర్‌ఘాట్‌ మీదుగా సాగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.. సీసీటీవీ కెమెరాల నిఘాలో భారీ పోలీసు బందోబస్తుతో శోభాయాత్ర కొనసాగుతోంది. హనుమాన్ శోభాయాత్రలో భక్తులు అధికం సంఖ్యలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో శోభాయాత్ర మార్గాలు మర్మోగాయి. భక్తులకు వివిధ సంఘాలు మంచినీరు, ప్రసాదం అందజేస్తున్నారు.

(310)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ