WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ ట్రైల‌ర్ విడుదల‌...!

క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ జీవిత క‌థ ఆధారంగా వ‌స్తోన్న చిత్రం...స‌చిన్ ఎ బిలియ‌న్ డ్రీమ్స్ ట్రైల‌ర్ ను ఈరోజు ముంబాయిలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా స‌చిన్ మాట్లాడుతూ ‘నన్ను అందరూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదిగో. మే 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది’ అని ట్వీట్‌ చేశారు.‘అజహర్‌’, ‘ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ల తర్వాత భారత క్రికెటర్‌ జీవితం ఆధారంగా రూపొందించిన మూడో చిత్రమిది. జేమ్స్‌ ఎర్స్‌కైన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కార్నివల్‌ మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.



(284)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ