WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కులాన్ని' తిట్టారనే...'చింతమనేని' అలిగారట...!

ఆయనకు మంత్రి పదవిపై మోజు లేదు... కానీ మంత్రి పదవి ఆయనకే ఇవ్వాలని ఆ జిల్లా ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. స్వంత నియోజకవర్గంలో చిన్న పిలుపునిస్తే క్షణాల్లో వేలాదిమంది కార్యకర్తలు వచ్చి వాలిపోతారు. మారుమూల ప్రాంత కార్యకర్తలకు కష్టంవస్తే ఆయనే స్వయంగా వెళతారు. స్వంత నియోజకవర్గంలో అపారమైన పట్టు ఉంది. అభిమానులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నారు. అటువంటి నాయకునికి మంత్రి వర్గ విస్తరణ సందర్భంలో నిరాదరణకు గురయ్యారు. అయినా కలత చెందలేదు. కానీ తనపై అనేక అక్రమ కేసులు పెట్టించి, కార్యకర్తలను పోలీసులతో కొట్టించి జైలుపాలు చేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంపై ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఆయన ఎవరో కాదు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌. నిర్మొహమాటంగా మాట్లాడడమే కాకుండా పారదర్శకంగా వ్యవహరిస్తారు. తమ నాయకునికి మంత్రి పదవి ఇవ్వలేదని వేలాది మంది కార్యకర్తలు నినాదాలతో ఆ నియోజకవర్గమంతా దద్దరిల్లేటట్లు చేశారు. 

   స్వంత నియోజకవర్గంలో కాకుండా మరి కొన్ని నియోజకవర్గాల్లో కూడా 'చింతమనేని' అంటే అభిమానించేవారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. తన సామాజికవర్గానికి తీవ్ర వ్యతిరేకి అయిన 'పీతాని సత్యనారాయణ'కు మంత్రి పదవి ఇవ్వటం 'చింతమనేని'కి మింగుడుపడడం లేదు. కాంగ్రెస్‌ హయాంలో అనేకసార్లు తన సామాజికవర్గంపై పత్రికల్లో రాయలేని భాషతో 'పీతాని' తిట్టారని ఆయన చంద్రబాబు సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో టిడిపి కార్యకర్తలను అనేక వేధింపులకు గురిచేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తారా...? తనను, తన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారు. 2014లో 'పీతాని'కి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడమే మీరు చేసిన పెద్ద తప్పు...! అయినప్పటికీ అంగీకరించాం...ఆయన గెలుపుకు సహకరించాం...మళ్లీ ఆయనకే మంత్రి పదవి ఇవ్వడంలో మర్మం ఏమిటి? అని 'చింతమనేని' 'చంద్రబాబు'ను ప్రశ్నించగా కొన్ని ఈక్వేషన్లతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది..నీ వెనుక నేను ఉన్నానని సిఎం బుజ్జగించారు. 'పీతాని'కి మంత్రి పదవి ఇవ్వడం వెనుక కేంద్ర మంత్రి సుజనాచౌదరి భారీ మొత్తంలో ప్యాకేజీ వసూలు చేసుకున్నారని...జిల్లాలో ప్రచారం జరుగుతోందని 'చింతమనేని' చంద్రబాబుకు చెప్పారు. అదంతా అభూతకల్పన అటువంటిదేమీ లేదు...కానీ 'పీతాని' గతంలో చేసిన తప్పులు నాకు ఇంత వరకు తెలియదు...నా దృష్టికి ఇంతకు ముందు మీరు తేలేదు...భవిష్యత్‌లో ఆ విధంగా జరగకుండా చూసుకుంటానని చంద్రబాబు ఆయనను అనునయించారు. 

   దీంతో చల్లబడిన 'చింతమనేని' 'సార్‌..మీ ఇష్టం...మీకు ఎప్పుడూ నేను విధేయుడినే...నిన్న కాక మొన్నకూడా మంత్రి పీతాని...తనను, తన కార్యకర్తలను, తన కులాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడారట. అంతే కాకుండా లం...కొడుకులని హీనంగా మాట్లాడారట...? మీ దృష్టికి తీసుకు వస్తాను..దీనిపై విచారణ జరపండని ఆయన సిఎంను కోరారట. పాత వాసనలు పోని మంత్రి పీతాని అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించకుండా చట్టం చేశామని గొప్పలు చెప్పుకోవడం సిఎం చంద్రబాబు దృష్టికి కొంత మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. పిలిచి పిల్లనివ్వడమే కాకుండా..ఖరీదైన కానుకలు ఇచ్చిన వ్యక్తిని పలు విధాలుగా అవమానించిన చందంగా 'పీతాని' వ్యవహారశైలి ఉందని టిడిపి ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. నిన్న కాక మొన్న అధికారులపై కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కులపరంగా విమర్శలు, ఆరోపణలు చేసిన 'పీతాని'కి మంత్రి పదవి ఇవ్వడం అధికారులను, ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా ఈ ఎపిసోడ్‌లో కేంద్ర మంత్రి సుజనాచౌదరిపై పశ్చిమగోదావరి జిల్లా టిడిపి కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేకతతోపాటు నిరసన కూడా వ్యక్తం అవుతోంది.

(843)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ