WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బోల్తా పడ్డ 'బోండా'...!

ఆయన తెలుగుదేశం పార్టీకివీర విధేయుడు. గతంలో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా తన సామాజికవర్గానికి చెందిన నాయకులందరూ, కార్యకర్తలు ప్రజారాజ్యం పార్టీలో చేరినా ఆయన మాత్రం టిడిపిలోనే కొనసాగారు. ఆ విధేయతే ఆయనకు 2014లో కలసివచ్చి ఎమ్మెల్యేను చేసి 'చంద్రబాబు'కు దగ్గర చేసింది. ఆయన ఎవరో కాదు..విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. విపక్షాలు చేసిన విమర్శలపై ధీటుగా స్పందించడమే కాకుండా 'చంద్రబాబు, చినబాబు'లపై ఈగ వాలనివ్వకుండా దూకుడుగా విమర్శలు చేసి వారిద్దరి మన్నలను పొందారు. వారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆర్థికపరంగా 'బోండా' స్వపక్షీయులు, విపక్షీయులు ఊహించనంత స్థాయికి ఎదిగారన్న ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆయనకి సంతృప్తి కలగలేదట. మంత్రి పదవిపై మోజు పెంచుకున్నారు. 

   ఆ పదవి కావాలని 'చంద్రబాబు, చినబాబు'లను స్వయంగా కలసికోరారు. మంత్రి వర్గ విస్తరణ సమయంలో మంత్రి పదవి దక్కడం ఖాయమని ఆశపడ్డారు. కానీ ఆఖరు నిమిషంలో కులాల సమీకరణలో 'బోండా'కు మంత్రి పదవి లభించలేదు. దీంతో ఆయన బాహాటంగా విమర్శలు చేయటమే కాకుండా 'చంద్రబాబు'పై వ్యక్తిగత విమర్శలు చేశారు. కాపులకు 'చంద్రబాబు' అన్యాయం చేస్తున్నారని తూలనాడారు. ఆవేశం...హద్దులను మరిచింది. చివరకు అధినేతకు ఆగ్రహం తెప్పించింది. దీంతో 'చంద్రబాబు' ఆయనను పిలిపించి చివాట్లు పెట్టారు. మొదటసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించావు..ఎంతో రాజకీయ భవిష్యత్‌ ఉంది...అయినా మంత్రి పదవి ఇవ్వలేదని బాహాటంగా, కులపరంగా విమర్శలు చేయటం తగునా..? అని క్లాస్‌ పీకారట. 

  అంతే కాకుండా 'నువ్వు విజయవాడలో ఏయే పనులు చక్కపెట్టుకున్నావో...నాకు తెలుసు...నా దగ్గర అన్ని రిపోర్టులు ఉన్నాయి...! గతంలో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా...'బోండా' బాహాటంగా బయటపడలేదు. 2014లో అవకాశం ఇవ్వడం ఆయనకు కాలం కలసివచ్చి ఎమ్మెల్యేను చేసింది. నిన్నటి వరకు కాపులకు న్యాయం చేసింది టిడిపి ప్రభుత్వమే అని 'ముద్రగడ పద్మనాభవం'పై దాడికి దిగిన 'బోండా'నే ఆయనకు మంత్రి పదవి దక్కపోవడంపై కాపులకు టిడిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని బయటపడి విమర్శలు చేసి చేతులు కాల్చుకున్నారు. నిన్నటి వరకు 'చంద్రబాబు,చినబాబు'ల దగ్గర ఆయనకు ఎంతో విలువ ఉంది. వారిద్దరూ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేవారు..తాజా సంఘటనలతో వారిద్దరూ 'బోండా' విమర్శలను, ఆరోపణలను తేలిగ్గా తీసుకుని పిల్లచేష్టలుగా భావించి కొట్టిపారేస్తారా...? మనసులో పెట్టుకుని సమయం చూసి వాతపెడతారా..? వేచి చూడాల్సిందే...!

(930)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ